Kavitha (IMAGE Credit: twitter)
Politics, లేటెస్ట్ న్యూస్

Kavitha: స్థానికంలో జాగృతి పోటీ?.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను సిద్ధం చేయాలనే యోచన

Kavitha: సంస్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) జాగృతి యాక్టీవిటీస్ స్పీడ్ పెంచారు. నియోజకవర్గాల పర్యటనలకు వెళ్తున్నారు. అయితే కవితకు పట్టుకున్న నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే ఈ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో జాగృతి పటిష్టతపైన ఫోకస్ పెట్టింది. పూర్తి స్థాయిలో జిల్లా కమిటీలు సైతం ప్రకటించేందుకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలోనే స్థానిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో పోటీచేయాలా? వద్దా? అనే ఆలోచిస్తున్నట్లు సమాచారం. పోటీ చేస్తే ఎన్నిస్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందనే వివరాలను సైతం సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 Also Read: Maa Mundeshwari Temple: దేశంలోనే వింతైన ఆలయం.. మేకను బలిస్తారు కానీ.. ఒక్క చుక్క రక్తం కారదు!

బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండి ?

స్థానిక సంస్థల్లో జాగృతి పోటీచేస్తే బీఆర్ఎస్ పార్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ పార్టీలో భాగంగానే జాగృతి కార్యక్రమాలు నిర్వహించింది. ఆపార్టీలోనే యువత, కొంతమంది కీలక నాయకులు సైతం జాగృతి సంస్థలో పనిచేసిన వారు ఉన్నారు. కొందరు సానూభూతి పరులు ఉన్నారు. ఆ తరుణంలో జాగృతి పోటీచేస్తే గులాబీ ఓటుబ్యాంకును చీల్చే అవకాశం ఉంది. దీంతో ఓటమిపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ౌ

కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆశలు?

తెలంగాణ జాగృతి పోటీ చేస్తే కాంగ్రెస్ కు కలిసి రానుంది. గ్రామస్థాయిలో జాగృతి కార్యకర్తలతో పాటు మహిళల్లో కవితపై కొంత సానుభూతి ఉంది. ఇది ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉంది. అంతేగాకుండా బీఆర్ఎస్ కేడర్ లోనూ కొంత మంది కవితకు సానుభూతి పరులు ఉన్నారు. ఈ తరుణంలో కవితకు పోలయ్యే ఓట్లు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీవే అవుతుండటంతో కాంగ్రెస్ కు ప్లస్ కానుందని పలువురు పేర్కొంటున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ కు కేడర్ ఉంది. మరోవైపు పార్టీ అధికారంలో ఉండటంతో కలిసివచ్చే అంశం. దీనికి తోడు కవిత పోటీచేస్తే బీఆర్ఎస్ ఓటుబ్యాంకు చీలే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ కు లాభం చేకూరుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నేడు కవిత కీలక భేటి

బతుకమ్మ సంబురాల్లో పాల్గొనేందుకు జాగృతి అధ్యక్షురాలు కవిత విదేశాలకు వెళ్లింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సోమవారం యూకే నుంచి బయల్దేరింది. మంగళవారం హైదరాబాద్ కు రానుంది. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్య నేతలతో జాగృతి రాష్ట్ర కార్యాలయంలో సమావేశం అవుతున్నారు. ఇప్పటికే జాగృతి ముఖ్య నేతలకు సమావేశం సమాచారం ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సమావేశంలో పంచాయతీ ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. నేతల అభిప్రాయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే పోటీచేయాలా? వద్దా అనే దానిపై క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు జాగృతి నేతలతో పాటు రాజకీయ పార్టీల్లోని నేతల్లో సైతం ఆసక్తి నెలకొంది.

 Also Read: Karnataka 1: ‘కాంతారా ఛాప్టర్ – 1’కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏపీ డిప్యూటీ సీఎం స్పందన

Just In

01

Mahakali: ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ ‘మహాకాళి’లో శుక్రాచార్యుడిగా ఎవరంటే?

Medak District: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌.. మెదక్‌లో రాజుకున్న రాజకీయ వేడి!

Rajasthan Bride: శోభనం రోజున వరుడికి బిగ్ షాక్.. వధువు దెబ్బకు ఫ్యూజులు ఔట్.. ఏమైందంటే?

H1B Visa Fee: హెచ్-1బీ ఫీజు పెంచిన ట్రంప్‌కి షాక్.. భారత్‌కు వచ్చే యోచనలో అమెరికా కంపెనీలు!

Kodama Simham: మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ కౌబాయ్ మూవీ ‘కొదమసింహం’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్!