Kayadu Lohar: టీవీకే (Tamilaga Vettri Kazhagam) పార్టీ వ్యవస్థాపకుడు, తమిళ స్టార్ హీరో విజయ్.. కరూర్ లో నిర్వహించిన బహిరంగ సభ తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో దాదాపు 39 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే ప్రముఖ నటి కాయదు లోహర్ సైతం ఈ ప్రమాదంలో తన స్నేహితుడ్ని కోల్పోయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆమె పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా నుంచి తన ఫ్రెండ్ చనిపోయినట్లు పోస్ట్ రావడం తీవ్ర చర్చకు కారణమైంది. అయితే దీనిపై నటి లోహర్ అధికారికంగా స్పందించారు. తన మిత్రుడు చనిపోయాడంటూ జరుగుతున్న ప్రచారంపై ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
నటి ఏమన్నారంటే?
తమిళ నటి కాయదు లోహర్ అధికారికంగా స్పందిస్తూ.. తన పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా నకిలీదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చర్చకు తావిచ్చిన పోస్టుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘ఎక్స్ ఖాతాలో పెట్టిన వ్యాఖ్యలు నావి కావు. కరూర్‌లో నాకు ఎలాంటి స్నేహితులు లేరు. నా పేరుతో ప్రచారం చేస్తున్న కథనాలు పూర్తిగా తప్పుడు సమాచారం. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మకండి. కరూర్ సభలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నా. దుఖంలో ఉన్న కుటుంబాల కోసం దేవుడ్ని ప్రార్ధిస్తున్నా’ అని నటి ఎక్స్ లో పేర్కొన్నారు.
The Twitter account circulating posts under my name is fake. I have no connection with it, and the statements made there are not mine.
I am deeply saddened by the tragic incident at the Karur rally, and my heartfelt condolences go out to the families who have lost their loved…
— Kayadu Lohar (@11Lohar) September 28, 2025
నకిలీ పోస్టులో ఏముందంటే?
కయాదు లోహర్ పేరుతో ఉన్న ఖాతా నుంచి నటి ఏడుస్తున్న ఫొటో, టీవీకే పార్టీ జెండాతో ఓ పోస్ట్ వచ్చింది. ‘కరూర్ సభలో నా అత్యంత సన్నిహితుడైన స్నేహితుడిని కోల్పోయాను. టీవీకే స్వార్థపూరిత రాజకీయాల కోసం ప్రాణాలు పోతున్నాయి. విజయ్.. ప్రజలు నీ స్టార్ డమ్ కోసం ఉపయోగించుకునే పావులు కాదు. నీ కోరికల కోసం ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి’ అంటూ నటి పేర్కొన్నట్లుగా ఆ పోస్టు వచ్చింది. ఈ పోస్టును చాలామంది నిజమని నమ్మారు. అంతేకాదు కొన్ని తమిళ ఛానళ్లు, నేషనల్ మీడియా సైతం విజయ్ పై నటి విమర్శలు చేసిందంటూ ప్రచారం చేశాయి. దీంతో కయాదు లోహర్.. నకిలీ పోస్టుపై తప్పక వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Mine is confirm the id name is kayadhu Lohar. It’s not a lie. pic.twitter.com/fdhaH5oodV
— Gayathri Raguramm – Say No To Drugs & DMK (@Gayatri_Raguram) September 28, 2025
Also Read: Indiramma Canteens: హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేవలం రూ.5కే వెరైటీ టిఫిన్స్, భోజనం
కయాదు లోహర్ ఎవరు?
కయాదు లోహర్.. సినిమాల విషయానికి వస్తే ఆమె 2021లో వచ్చిన కన్నడ చిత్రం ‘ముగిల్‌పేట్తో’ తెరంగేట్రం చేశారు. ఈ ఏడాది వచ్చిన తమిళ ఫాంటసీ డ్రామా చిత్రం.. ‘డ్రాగన్’ లో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఆమె తమిళంలో వరుస చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.