cinema ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

OTT Movie: అమ్మాయిల బాడీ పార్ట్స్ తో అలాంటి ఆటలు.. ఓ మై గాడ్.. ఇది మామూలు థ్రిల్లర్ కాదు బాబోయ్!

OTT Movie: ఇటీవలే థియేటర్ కంటే ఓటీటీలో రిలీజ్ అయ్యి సినిమాలు అదరగొడుతున్నాయి. అలా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. ఇక రీసెంట్ గా రిలీజైన తమిళ మూవీ దూసుకెళ్తుంది. తమిళంలో ‘ఇరైవన్’గా విడుదలయ్యి.. తెలుగులో ‘గాడ్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. మిస్టరీ, సస్పెన్స్, ఊహాతీత ట్విస్టులతో నిండిన ఈ మూవీ థ్రిల్లర్ ప్రియులను అలరిస్తోంది.

Also Read: Ponguleti Srinivas Reddy: జీహెచ్ఎంసీ ప‌రిధిలోని పేద‌ల‌కు గుడ్ న్యూస్.. అపార్ట్‌మెంట్ త‌ర‌హాలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం

కథ విషయనికొస్తే..

ఈ కథ అన్ని సినిమాల కంటే కొత్తగా ఉంది. జయం రవి ఈ చిత్రంలో ఏసీపీ అర్జున్‌గా నటించాడు. న్యాయం కోసం చట్టాన్ని సైతం ధిక్కరించే ధైర్యవంతమైన పోలీస్ ఆఫీసర్‌గా అతని పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అతని లక్ష్యం ఒక్కటే.. నగరాన్ని గడగడలాడించే స్మైలీ కిల్లర్ బ్రహ్మ (రాహుల్ బోస్)ను అడ్డుకోవడం. ఈ క్రూరమైన సీరియల్ కిల్లర్ మహిళలను లక్ష్యంగా చేసుకొని, వారిని హత్య చేసి, వారి నుంచి శరీర భాగాలను తొలగించి వదిలేస్తాడు. ఈ కేసు అర్జున్‌కి వ్యక్తిగతంగా మారుతుంది. తన స్నేహితుడు ఆండ్రూతో కలిసి ఈ రహస్యాన్ని ఛేదించేందుకు అర్జున్ అనేక ప్రయత్నాలు చేస్తాడు.

Also Read: Bathukamma Flowers: బతుకమ్మలో పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం.. ఆ పూలతో ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలో తెసుసా?

కథ నెమ్మదిగా ముందుకు సాగుతున్న సమయంలో ఒక్కో ట్విస్ట్‌తో ఆడియెన్స్ ను ఆశ్చర్యపరుస్తుంది. చివర్లో బయటపడే నిజం, బ్రహ్మ వెనుక దాగిన కథ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. దర్శకుడు ఐ. అహ్మద్ ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌ను మానవ మనసులోని చీకటి కోణాలను లోతుగా చూపిస్తూ తెరకెక్కించారు. హీరో జయం రవి, నయనతార ఇద్దరూ  అద్భుతంగా నటించారు. అయితే, రాహుల్ బోస్ విలన్‌గా చేసిన పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రాణం పోసిందని చెప్పొచ్చు. కథలో వచ్చే అనూహ్య మలుపులు, ఎమోషనల్ డెప్త్ ఆడియెన్స్ ను సీటు లోనే కూర్చోబెడతాయి. ఇది కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు, డార్క్ కాన్సెప్ట్‌తో కూడిన ఒక గ్రిప్పింగ్ మిస్టరీ డ్రామా.

Also Read: CM Revanth Reddy: ఈ నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగుల జీతాల నుంచి పది శాతం కట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖలు

ఎక్కడ చూడాలంటే?

‘గాడ్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ భాషల్లో (‘ఇరైవన్’గా తమిళంలో) స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానుంది. మిస్టరీ, సస్పెన్స్, క్రైమ్, డార్క్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ చిత్రం ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్. ప్రతి సన్నివేశంలోనూ ఉత్కంఠ, భావోద్వేగాలకు లోనవుతారు. ఈ చిత్రాన్ని తప్పక చూడండి. మంచి థ్రిల్లింగ్ లాగా అనిపిస్తుంది.

Just In

01

Local Body Elections: నాగర్ కర్నూల్ జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి.. ఆశావాహుల్లో మెుదలైన టెన్షన్!

Maa Mundeshwari Temple: దేశంలోనే వింతైన ఆలయం.. మేకను బలిస్తారు కానీ.. ఒక్క చుక్క రక్తం కారదు!

The Raja Saab Trailer: ప్రభాస్ భయపెట్టడానికి వచ్చేశాడు రోయ్.. చూసేద్ధాం రండీ..

Jogulamba Temple: జోగులాంబ సన్నిధిలో మంత్రి కొండా సురేఖ

Crime News: చికెన్ కూర కావాలని అడిగినందుకు.. 7 ఏళ్ల కుమారుడ్ని కొట్టి చంపిన తల్లి