ai ( Image Source:Twitter)
తెలంగాణ

Telangana Intermediate Board: ఇక పై ఇంటర్ లో ఏఐ కోర్సు..

Telangana Intermediate Board: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఇప్పటికే ఇంజినీరింగ్ తో పాటు డిగ్రీ సిలబస్ లో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. కాగా ఇంటర్ బోర్డులోనూ సిలబస్ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేయనుంది. భవిష్యత్ మొత్తం ఆధునికత వైపు పరుగెడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ట్రెండ్స్ కు అనుగుణంగా ఉండేలా సిలబస్ రూపకల్పన చేయడంపై అధికారులు దృష్టిసారిస్తున్నారు. డిగ్రీ లెవల్లో కొత్త సిలబస్ ను ఇంట్రడ్యూస్ చేసిన సర్కార్.. ఇంటర్ లోనూ అందుకు సంబంధించిన అంశాలపై అవగాహన కోసమైనా ఇంటర్ లోనే అందుకు సంబంధించిన సిలబస్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్ లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయాలని భావిస్తోంది. ఏఐతో పాటు డేటాసైన్స్, రోబోటిక్స్, మిషన్ లర్నింగ్ తదితర పాఠాలనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇంటర్మీడియట్ లో కొత్త సిలబస్ ను ఇంట్రడ్యూస్ చేయనున్న తరుణంలో ప్రస్తుతం ఉన్న వివిధ సబ్జెక్టుల్లో భారీగా ఉన్న సిలబస్ ను కోత పెట్టాలని బోర్డు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. కొంతకాలంగా జేఈఈ, నీట్, ఈఏపీసెట్ సహా పలు ఎంట్రెన్స్ టెస్టుల్లో ప్రశ్నలు రాని, ప్రాధాన్యత లేని సిలబస్ ను తొలగించాలని బోర్డు యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ కొత్త సిలబస్ ను 2026-27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే దీనిపై కార్యాచరణ సిద్ధమైనా మరోసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గ్రీన్ సిగ్నల్ లభించగానే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయాలనే యోచనలో ఉంది. అంతేకాకుండా కొత్త పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నట్లు సమాచారం. దీనికితోడు క్వాలిటీ పేపర్తో పుస్తకాలను ప్రింట్ చేయించాలని ఇంటర్ బోర్డు డిసైడ్ అయినట్లు తెలిసింది.

కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఎన్సీఈఆర్టీ ఇంటర్ సిలబస్ లో మార్పులు చేసింది. దీన్ని తెలంగాణ ఇంటర్ పుస్తకాల్లోకి తీసుకురావాల్సి ఉంది. అయితే రెండేండ్ల క్రితమే నూతన సిలబస్ ను తీసుకురావాలని ఇంటర్ బోర్డు కమిటీ తీర్మానించింది. కానీ సిలబస్ తయారీలో ఆలస్యం, ఉన్నతాధికారుల నుంచి సకాలంలో అనుమతులు రాకపోవడంతో 2025-26లో కొత్త సిలబస్ ను ఇంప్లిమెంట్ చేయలేదని తెలుస్తోంది. కాగా వచ్చే ఏడాది నుంచి ప్రస్తుత ట్రెండ్స్ కు అనుగుణంగా సిలబస్ ను రూపొందించి మరిన్ని మార్పులు చేసి అమలు చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఇంటర్ లో ప్రధానంగా ఫిజిక్స్, కెమిస్ర్టీ, జువాలజీ, బాటనీతో పాటు కామర్స్, ఎకనామిక్స్ తదితర సబ్జెక్టుల్లో ఎక్కువ కోత పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జేఈఈ, నీట్, ఈఏపీసెట్ వంటి ప్రవేశపరీక్షల్లో ఐదేండ్ల నుంచి ఏయే టాపిక్స్ నుంచి ప్రశ్నలు రాలేదో వాటిని పూర్తిగా తొలగించి కొత్త సబ్జెక్టును యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకటో, రెండో సందర్భాల్లో రావడంతో పాటు తక్కువ ప్రియారిటీ ఉన్న ప్రశ్నల కోసం అవసరమైతే సప్లిమెంటరీ బుక్ తీసుకురావాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. సిలబస్ మార్పులతో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చూడటమే కాక, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కూడా ఇబ్బందులు లేకుండా చూడటమే బోర్డు లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.

Just In

01

Ram Charan: చేతులపై కిరోసిన్ పోసుకుని మ్యూజిక్ కొట్టావా థమన్.. ‘ఓజీ’ మ్యూజిక్‌పై చరణ్ రియాక్షన్

Jatadhara: ‘జటాధర’ ధన పిశాచి వచ్చేది ఎప్పుడంటే..

KTR: జూబ్లీహిల్స్‌లో టూరిస్ట్ మంత్రుల ఎన్నికల ప్రచారం.. ఎన్నికలు అయిపోగానే గాయబ్!

Toss controversy: టాస్ సమయంలో ఊహించని సీన్.. పాకిస్థాన్ కెప్టెన్‌తో మాట్లాడని రవిశాస్త్రి

CM Revanth Reddy: దేశానికే ఆదర్శంగా నిలవనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం