gurpreet singh sandhu indian football team captain
స్పోర్ట్స్

FIFA World Cup: గోల్.. క్వాలిఫై

Indian Football Team: ఫిఫా వరల్డ్ కప్‌లో ఆడటానికి క్వాలిఫై మ్యాచ్‌లను భారత ఫుట్ బాల్ టీమ్ ఆడుతున్నది. ఇందులో భాగంగా మంగళవారం ఖతర్ టీమ్‌తో తలపడనుంది. కువైట్‌తో మొన్న జరిగిన మ్యాచ్‌‌లో గోల్ చేయకుండానే డ్రాగా ముగించడంతో ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది. అదీ మన టీమ్‌లో సీనియర్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రీ లేకుండా ఈ మ్యాచ్ ఆడాల్సి వస్తున్నది. కువైట్‌తో మ్యాచ్‌ ఆయనకు చివరిది. సునీల్ ఛెత్రీ రిటైర్ కావడంతో ప్రస్తుత గోల్ కీపర్ 32 ఏళ్ల గుర్‌ప్రీత్ సింగ్ సంధు సారథ్య బాధ్యతలు తీసుకుంటున్నారు. గుర్‌ప్రీత్ సింగ్ సంధు కెప్టెన్సీలో భారత ఫుట్ బాల్ టీమ్.. దోహాలో నేడు ఖతర్‌తో తలపడనుంది.

మూడో రౌండ్ క్వాలిఫై మ్యాచ్‌లకు అర్హత సాధించాలంటే ఖతర్‌తో భారత్ గెలిచి తీరాల్సిందే. ఓడితే ఫిఫా వరల్డ్ కప్ సిరీస్ పై ఆశలు వదలుకుని ఇంటికి రావాల్సిందే. గ్రూప్ ఏ నుంచి మూడో రౌండ్ క్వాలిఫై మ్యాచ్‌లకు బెర్త్ కన్ఫామ్ చేసుకున్న ఖతర్‌ టాప్ ప్లేస్‌లో ఉండగా -3 గోల్స్‌తో భారత్ రెండో స్థానంలో ఉన్నది. ఆ తర్వాత -10 గోల్స్‌తో అఫ్ఘనిస్తాన్ మూడో స్థానంలో, కువైట్ నాలుగో స్థానంలో ఉన్నది. ఈ గ్రూప్ నుంచి ఖతర్‌తోపాటు మరో టీమ్ మాత్రమే మూడో రౌండ్‌కు సెలెక్ట్ అవుతుంది.

నేటి మ్యాచ్‌లో ఖతర్‌పై గెలిస్తే భారత్ థర్డ్ రౌండ్‌కు క్వాలిఫై అవుతుంది. అలాగే.. ఏషియన్ కప్‌లోకి డైరెక్ట్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఒక వేళ డ్రాగా ముగిస్తే.. అఫ్ఘాన్, కువైట్‌ల మధ్య మ్యాచ్ డ్రా అయితే.. అప్పుడు రెండో స్థానం కోసం ఈ మూడు టీమ్‌లు తలపడాల్సి ఉంటుంది.

Just In

01

Red Sea cable cut: ఎర్ర సముద్రంలో కేబుల్స్ కటింగ్.. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం!

Trisha: విజయ్ పొలిటికల్ పార్టీపై త్రిష ఆసక్తికర కామెంట్స్.. ఏదో తేడాగా ఉందేంటి?

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నుంచి ‘పప్పీషేమ్’ ఫుల్ సాంగ్ ఇదే.. ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు..

Chicken Dosa Video: చికెన్ దోశ కోసం.. రెండుగా చీలిన సోషల్ మీడియా.. నెట్టింట ఒకటే రచ్చ!

Jangaon district: గ్రామాల్లో వెలుగ‌ని వీధిలైట్లు.. అప్పులో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు!