carlos alcaraz
స్పోర్ట్స్

Rafael Nadal: శభాష్.. అల్కారజ్

French Open: ఫ్రెంచ్ ఓపెన్‌లో కొత్త చాంపియన్‌గా స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కారజ్ అవతరించాడు. నాదల్ బాటలో నడుస్తూ ఫ్రెంచ్ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ కైవసం చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను దక్కించుకోవడమే కాదు.. నాదల్ రికార్డును తిరగరాశాడు. సీనియర్ ఆటగాడు.. జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించాడు. 4 గంటల 19 నిమిషాలపాటు సాగిన హోరాహోరీ మ్యాచ్‌లో గెలుపు వీరిద్దరి మధ్య దోబూచులాడింది. చివరి రెండు సీడ్‌లలో అల్కారజ్.. జ్వెరెవ్‌కు అవకాశం ఇవ్వకుండా ఆధిక్యతను ప్రదర్శించి విజయాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో మూడు రకాల కోర్టుల్లో (క్లే, గ్రాస్, హార్డ్) విజయం సాధించిన పిన్నవయస్కుడిగా అల్కారజ్ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు వరకు ఈ రికార్డు నాదల్ పేరిట ఉన్నది. ఇక రొలాండ్ గారోస్‌లో టైటిల్ గెలిచిన రెండో పిన్న వయస్కుడిగా అల్కారజ్ నిలిచాడు. నాదల్ 19 ఏళ్ల వయసులో గెలవగా.. అల్కారజ్ 21 ఏళ్ల వయసులో సాధించాడు.

అల్కారజ్ ఫీట్ పై నాదల్ స్పందించాడు. అల్కారజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. కంగ్రాట్స్ కార్లోస్ అల్కారజ్ అని అభినందించాడు. నీ విజయం అద్భుతం అంటూ కొనియాడాడు. పెద్ద విజయం అనీ ట్వీట్ చేశాడు. అల్కారజ్ విజయం సంతోషకరం అని పేర్కొన్నాడు. నాదల్‌ను ఆరాధిస్తూ.. ఆయన బాటలోనే నడిచిన అల్కారజ్ ఇప్పుడు నాదల్ రికార్డునే బద్దలు కొట్టాడు.

ఐదు సెట్లపాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఆటలో అల్కారజ్ పైచేయి సాధించాడు. తద్వార మూడు గ్రాండ్ స్లాట్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

Just In

01

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!