BSNL New Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL, తన సరసమైన ధరలతో ప్రైవేట్ టెలికాం దిగ్గజాలైన Airtel, Jio, Vi లకు గట్టి పోటీ ఇస్తూ మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. కేవలం రూ.225 ధరతో, ఈ కొత్త 30-రోజుల ప్లాన్ అపరిమిత కాలింగ్, డేటా, ఇతర ఆకర్షణీయ ప్రయోజనాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ ప్లాన్ ప్రైవేట్ కంపెనీల సమానమైన ప్లాన్‌ల కంటే 40% వరకు చౌకగా ఉండటం విశేషం.
BSNL రూ.225 ప్లాన్ హైలైట్స్ఈ సూపర్ సేవర్ ప్లాన్‌లో వినియోగదారులకు లభించే ప్రయోజనాలు:
అపరిమిత కాలింగ్: భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్.
ఉచిత రోమింగ్: దేశవ్యాప్తంగా ఫ్రీ నేషనల్ రోమింగ్.
డేటా బోనంజా: రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా (తర్వాత 40 Kbps వేగం).
SMS సౌలభ్యం: రోజుకు 100 ఉచిత SMSలు.
BiTV యాక్సెస్: 350+ లైవ్ టీవీ ఛానెళ్లు, వివిధ OTT యాప్‌లతో సహా ఉచిత BiTV స్ట్రీమింగ్.
4G లాంచ్‌తో దూసుకెళ్తున్న BSNL
BSNL తన ‘స్వదేశీ’ 4G నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించింది, దీని ద్వారా 9 కోట్లకు పైగా వినియోగదారులు ప్రయోజనం పొందనున్నారు. భారతీయ సాంకేతికతతో నిర్మితమైన ఈ 4G నెట్‌వర్క్, 5Gకి అప్‌గ్రేడ్ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది, త్వరలో 5G సేవలు కూడా మొదలు కానున్నాయి. అంతేకాదు, మెరుగైన కనెక్టివిటీ కోసం BSNL 97,500 కొత్త మొబైల్ టవర్‌లను ఏర్పాటు చేస్తోంది. ప్రైవేట్ కంపెనీలతో పోలిక Airtel, Vi లాంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు సమానమైన ప్రయోజనాలతో (2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMS) 30-రోజుల ప్లాన్‌లను రూ.399కి అందిస్తున్నాయి, అంటే BSNL ప్లాన్ కంటే రూ.174 ఎక్కువ. కేవలం రూ.7.50 రోజువారీ ఖర్చుతో, BSNL ఈ ప్లాన్ బడ్జెట్-ఫ్రెండ్లీ వినియోగదారులకు బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.