CM Revanth Reddy: (IMAGE CRDIT: SWETCHA REPORTER)
తెలంగాణ, హైదరాబాద్

CM Revanth Reddy: ఆ రంగంలో భారీగా పెట్టుబడులు.. 50 వేల మందికి ఉపాధి అవకాశాలు

CM Revanth Reddy: హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పేర్కొన్నారు. ఆయన టూరిజం కాన్ క్లేవ్ లో మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా టూరిజంకు పాలసీ లేదన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించదన్నారు. కానీ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక పాలసీ తీసుకువచ్చామన్నారు.పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిన శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Raoని అభినందిస్తున్నానని తెలిపారు. తెలంగాణలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదని, ఇది ఒరిజినల్ సిటీ అని వివరించారు. హైదరాబాద్ ప్రపంచ నగరాలత పోటీపడుతుందన్నారు.

 Also Read: Ponguleti Srinivas Reddy: ఈ జిల్లాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి కీలక అదేశాలు

ప్రాజెక్టులు పెట్టుబడులు పెట్టగా, 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు

అందుకే తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, లాభాలు పొందాలని సీఎం ఇన్వెస్టర్లను కోరారు. ఇండియా పాకిస్థాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్ లో ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహించామన్నారు. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ సెఫెస్ట్ ప్లేస్ అని వివరించారు. అనంతరం టూరిజం కాంక్లేవ్‌లో తెలంగాణ లో రూ.15,279 కోట్ల పెట్టుబడులు, 50 వేల మందికి ఉపాధికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. మొత్తం 30 ప్రాజెక్టులు పెట్టుబడులు పెట్టగా, 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. తద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో 14 పీపీపీ ప్రాజెక్టులు రూ.7,081 కోట్లు,16 ప్రైవేట్ రంగ ప్రాజెక్టులు రూ.8,198 కోట్లతో ఒప్పందాలు చేసుకున్నాయి.

రామోజీ ఫిలిం సిటీ రూ. 2,వేల కోట్ల విస్తరణ

అనంతగిరిలో లగ్జరీ వెల్నెస్ రిట్రీట్, వికారాబాద్‌లో తాజ్ సఫారీ, విన్యార్డ్ రిసార్ట్, మూడు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, రామోజీ ఫిలిం సిటీ రూ. 2,వేల కోట్ల విస్తరణ వంటివి జరిగాయి. మొదటిసారిగా ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్‌కాంటినెంటల్, సెయింట్ రీజిస్, ఒబెరాయ్ హోటల్స్ హైదరాబాద్‌కి రానున్నాయి. పది వేల కొత్త హోటల్ గదులు, థీమ్ పార్కులు, ఫిలిం టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్ అభివృద్ధితో తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దనున్నారు.

రామోజీ ఫిల్మ్‌సిటీ సరికొత్తగా

పర్యాటకులను ఆకట్టుకునేందుకు రామోజీ ఫిల్మ్‌సిటీ సరికొత్తగా రెండు ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురానుంది. సందర్శకులకు కొత్త అనుభూతులు పంచేలా ఈ ప్రాజెక్టుల ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబల్ టూరిజం విలేజ్‌, నైట్ సఫారీ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, తదితరులు ఉన్నారు.

 Also Read:TGSRTC: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఎంజీబీఎస్‌లో రాకపోకలు బంద్.. ఆర్టీసీ కీలక ప్రకటన

Just In

01

Ind Vs Pak Final: అదరగొట్టిన బౌలర్లు.. పాకిస్థాన్ ఆలౌట్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్!

Jr NTR: అమ్మమ్మ చెప్పిన కథలు.. తెరపై చూశాక మాటలు రాలేదు

Assembly Restrictions: సోమవారం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు.. ఎందుకంటే?

Thaman S: ‘ఓజీ 2’ మాత్రమే కాదు.. ఇంకా చాలా పార్ట్స్ వస్తాయ్..

Cyber Crimes: స్మాట్‌గా ఆకర్షిస్తారు… నీట్‌గా మోసం చేస్తారు… పెరుగుతున్న సైబర్ మోసాలు