the-rajasab (image :x)
ఎంటర్‌టైన్మెంట్

The Raja Saab Trailer: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ట్రైలర్ విడుదల తేదీ ప్రకటించిన నిర్మాతలు..

The Raja Saab teaser: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమా ఆప్డేట్ కోసం ఎదురు చూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ చెప్పారు నిర్మాతలు. అయితే ది రాజాసాబ్ సినిమా నుంచి టీజర్ విడుదల తేదీని ప్రకటించారు. దీనికి సంబంధించి పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో సెప్టెంబర్ 29 తేదీ సాయంత్రం 6 గంటలకు ‘ది రాజాసాబ్’ సినిమా నుంచి టీజర్ విడుదల చేయనున్నారు. దీనిని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టింది. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

REad also-Medak Heavy Rains: ఆ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం

తెలుగు సినిమా పరిశ్రమలో బాహుబలి, సాహో, సలార్ వంటి మాస్ ఎంటర్‌టైనర్స్‌తో మెరిసిన ప్రభాస్, ఇప్పుడు హారర్ కామెడీ జోనర్‌లోకి ప్రవేశిస్తున్నాడు. ‘ది రాజాసాబ్’ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక పాన్-ఇండియా ప్రాజెక్ట్. రాజసానికి విరుద్ధంగా తిరుగుబాటు చేసే యువ వారసుడి కథనం, భయం, కామెడీ రొమాన్స్ అంశాలతో నిండి ఉంటుంది. సంక్రాంతి సమయంలో జనవరి 9, 2026న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదల చేయనున్నారు నిర్మాతలు. ఈ సినిమా, ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Read also-Mirai Movie: మరో ఆఫర్ ప్రకటించిన ‘మిరాయ్’ నిర్మాత.. పండగ కానుక అదిరింది!

కాస్ట్ పరంగా, ప్రభాస్ ప్రధాన పాత్రలో మెరుస్తున్నాడు. అతనితో పాటు మాళవికా మోహనన్ (రేయా), నిధి అగర్వాల్ (మీరా), రిద్ది కుమార్ (ప్రియా) వంటి హీరోయిన్లు కనిపిస్తారు. విలన్ రోల్‌లో సంజయ్ దత్, కామెడీ ట్రాక్‌లో బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను,  గణేష్, సత్య  తదితరులు కనిపిస్తారు. మరిన్ని పాత్రల్లో బోమన్ ఇరానీ, జారినా వాహబ్, సముద్రఖని, అనుపమ్ ఖేర్, ప్రకాష్ రాజ్ ఉన్నారు. సంగీతం తమన్ ఎస్ స్వరాలు అందించారు. ఇది చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే సినిమాపై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Just In

01

Thaman S: ‘ఓజీ 2’ మాత్రమే కాదు.. ఇంకా చాలా పార్ట్స్ వస్తాయ్..

Cyber Crimes: స్మాట్‌గా ఆకర్షిస్తారు… నీట్‌గా మోసం చేస్తారు… పెరుగుతున్న సైబర్ మోసాలు

Tollywood: టాలీవుడ్ పెద్దరికం.. బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నారా?

Ind-Pak Toss Update: ఆసియా కప్ ఫైనల్‌ మ్యాచ్‌.. టాస్ గెలిచిన భారత్.. జట్టులో కీలక మార్పు

Hyderabad-Vijayawada: హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం 2 గంటలే: మంత్రి కోమటి రెడ్డి