Anasuya Bharadwaj: మరోసారి సోషల్ మీడియాలో మంటలు రేపిన రంగమ్మత్త
Anasuya
ఎంటర్‌టైన్‌మెంట్

Anasuya Bharadwaj: మరోసారి సోషల్ మీడియాలో మంటలు రేపిన రంగమ్మత్త.. ఫొటోలు వైరల్!

Anasuya Bharadwaj: టాలీవుడ్ తెరపైన, బుల్లితెరపైనా తనదైన ముద్ర వేసిన నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. అయితే, తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న ఫోటోలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. ఫారిన్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. బ్లాక్ కలర్ స్విమ్‌సూట్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చేసింది. ఆమె గ్లామర్ అవతార్ అభిమానులను, నెటిజన్లను కైపెక్కిస్తోంది.

Also Read- TVK Rally Stampede: తమిళ హీరో విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట.. పెద్ద సంఖ్యలో మరణాలు

వావ్ అనాల్సిందే

బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనసూయ ఎప్పుడూ తన ఫ్యాషన్ సెన్స్‌తో ప్రయోగాలు చేస్తుంటుంది. ఈసారి తన ఫ్యాన్స్ అంచనాలకు మించి, ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ పక్కన దిగిన ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ స్విమ్‌సూట్‌లో.. ఆమె కాన్ఫిడెంట్ లుక్, ఫిట్‌నెస్ చూస్తే వావ్ అనాల్సిందే. ఇది కేవలం ఒక ఫోటో షూట్ కాదు, తన వ్యక్తిగత స్వేచ్ఛ (Personal Freedom)ను, ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. స్విమ్‌సూట్‌లో స్టైలిష్ పోజులు ఇస్తూ, ఆమె తనలోని అనసూయ 3.0ను పరిచయం చేసిందనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు పిచ్చెక్కించింది. ముఖ్యంగా తన భర్త పుట్టినరోజును పురస్కరించుకుని, ఫారెన్ టూర్‌లో ఆమె చేసిన ఎక్స్‌పోజింగ్ పిక్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయనేది తెలియంది కాదు.

Also Read- Ponguleti Srinivas Reddy: ఈ జిల్లాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి కీలక అదేశాలు

గ్లామర్ ట్రీట్‌ అరాచకం

సాధారణంగా భారతీయ నటీమణులు తమ ఫ్యాషన్‌ను ఇలాంటి బోల్డ్ లుక్స్‌తో ప్రదర్శించినప్పుడు విమర్శలు రావడం సహజం. కానీ అనసూయ.. ఈ ఫోటోల ద్వారా గ్లామర్ హద్దులు చెరిపేసి, ‘నా ఇష్టం’ అన్నట్టుగా ముందుకు సాగింది.. సాగుతోంది. స్విమ్‌సూట్‌లో ఆమె ఇచ్చిన గ్లామర్ ట్రీట్‌ను బోల్డ్, అరాచకం, ఆల్ టైమ్ గ్లామర్ షో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. తన హాట్ అండ్ ఫిట్ ఫిజిక్‌ను ఏమాత్రం దాచుకోకుండా చూపించిన ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ, ఈ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ సరికొత్త అవతార్‌తో, అనసూయ సోషల్ మీడియాలో ట్రూ గ్లామర్ క్వీన్‌గా నిలిచింది. చూస్తుంటే, ఈ ఫోటోల వైరల్ ట్రెండ్ ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు.

">

ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా దూసుకెళుతోంది. ‘రంగస్థలం’ సినిమా తర్వాత అనసూయను అందరూ ‘రంగమ్మత్త’ అని పిలవడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి వరసగా ఆమె సినిమాలు చేస్తూనే ఉంది. కొన్ని మంచి పాత్రలు కూడా ఆమెకు పడ్డాయి. రీసెంట్‌గా వచ్చిన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు