Digital-Arrest-Case
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Cyber Crime: డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరింపు.. గుండెపోటుతో బాధితురాలి మృతి

Cyber Crime: ఒత్తిడికి గురై గుండెపోటు.. రిటైర్డ్ డాక్టర్ మృతి

ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబర్​ క్రైమ్ పోలీసులు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: డిజిటల్​ అరెస్ట్ పేరిట సైబర్ క్రిమినల్స్ బెదిరింపులకు పాల్పడడంతో మానసిక ఒత్తిడి లోనై, గుండెపోటుకు దారితీసి ఓ రిటైర్డ్ డాక్టర్ మరణించారు. ఈ కేసులో హైదరాబాద్ సైబర్​ క్రైమ్ పోలీసులు శనివారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ (Cyber Crime) డీసీపీ దార కవిత తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధురాలు మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో సివిల్ సర్జన్​ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. కాగా, ఈనెల 5న ఆమెకు వాట్సప్ నుంచి వీడియో కాల్​ చేసిన సైబర్ నేరగాళ్లు తమను తాము బెంగళూరు పోలీసులుగా చెప్పుకొన్నారు. మానవ అక్రమ రవాణా కేసుతో సంబంధం ఉన్నట్టుగా తమ విచారణలో బయట పడిందంటూ ఆమెను బెదరగొట్టారు.

Read Also- TVK Rally Stampede: తమిళ హీరో విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట.. పెద్ద సంఖ్యలో మరణాలు

సుప్రీంకోర్టు, ఎన్ ఫోర్స్​‌మెంట్ డైరెక్టర్, రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా నుంచి జారీ అయినట్టుగా ఫోర్జరీ పత్రాలు చూపించి కేసులో అరెస్ట్ కావటం ఖాయమని భయపెట్టారు. దాంతో డాక్టర్‌గా పని చేసిన ఆ వృద్ధురాలు ఎక్కడ తన పరువు పోతుందోనన్న భయంతో యూనియన్​ బ్యాంక్‌లోని తన పెన్షన్​ ఖాతా నుంచి సైబర్ క్రిమినల్స్ చెప్పిన ఐసీఐసీఐ బ్యాంక్​ అకౌంట్‌కు రూ.6.60 లక్షలు బదిలీ చేసింది. అయితే, ఆ తరువాత కూడా సైబర్ క్రిమినల్స్ మరింత డబ్బు బదిలీ చేయాలని మరో మూడు రోజులపాటు ఆమెను బెదిరిస్తూ వచ్చారు. ఈ ఒత్తిడితో గుండెపోటుకు గురైన ఆమె చనిపోయింది. ఈ మేరకు వృద్ధురాలి కుమారుడు ఫిర్యాదు చేయగా సీసీఎస్​ పోలీసులు కేసులు నమోదు చేశారు.

Read Also- Cow Rescue: భారత పర్యటనలో ఉన్న ఈ ఆస్ట్రేలియా టూరిస్ట్‌ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనేమో!

కాగా, ఈ కేసులో సైబర్ క్రైమ్ సీఐ మట్టం రాజు, హెడ్​ కానిస్టేబుల్​ సునీల్ కుమార్​, కానిస్టేబుళ్లు అశోక్, సుదర్శన్, సాయినాథ్, రాజేందర్​ లతో విచారణ జరిపారు. మోసంతో సంబంధం ఉన్న మహారాష్ట్ర కోల్హాపూర్​ జిల్లాకు చెందిన విశ్వాస్​ దత్తాత్రేయ, మిరాజే, శంకర్ సుపూర్‌లను అరెస్ట్ చేశారు. విచారణలో ఈ ఇద్దరు కమీషన్‌కు కక్కుర్తి పడి తమ తమ బ్యాంక్​ ఖాతాలను సైబర్ క్రిమినల్స్‌కు సమకూర్చినట్టుగా వెల్లడైంది.

Read Also- YSRCP: రికార్డుల నుంచి తొలగింపు కాదు.. సభలో క్షమాపణ చెప్పాలి.. బాలయ్య వివాదంపై వైసీపీ డిమాండ్

Just In

01

Anasuya Bharadwaj: మరోసారి సోషల్ మీడియాలో మంటలు రేపిన రంగమ్మత్త.. ఫొటోలు వైరల్!

K-Ramp: ‘కె-ర్యాంప్’ అంటే బూతు మాట కాదు.. ఏంటంటే..?

Nikhil Siddhartha: నేను 2008లోనే చెప్పా.. ‘ఓజీ’ సినిమాపై నిఖిల్ ఆసక్తికర పోస్ట్!

Medak Heavy Rains: ఆ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం

Cyber Crime: డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరింపు.. గుండెపోటుతో బాధితురాలి మృతి