Telangana Assembly: బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై విచారణకు షెడ్యూల్ విడుదలైంది. అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్ నర్సింహాచార్యులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 29న (సోమవారం) ఉదయం 11 గంటలకు ఈ విచారణలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో విచారణ మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య , మధ్యాహ్నం ఒంటి గంటకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ నిర్వహిస్తున్నట్లు ఆ షెడ్యూల్ లో పేర్కొన్నారు.
అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ Telangana Assembly) గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) విచారణ చేయనున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ దశలో న్యాయవాదులు కీలక వాదనలు వినిపించనున్నారు. అక్టోబర్ 1న మరోసారి అదే కేసులపై విచారణలు కొనసాగనున్నాయి. పిటిషనర్‌లు, ప్రతివాదుల తరఫున న్యాయవాదులు ప్రత్యక్ష వాదనలు వినిపిస్తారు. స్పీకర్ లేదా చైర్మన్ ఆధ్వర్యంలో 10వ షెడ్యూల్ ప్రకారం విచారణ జరపనున్నారు.
Also Read: Sonam Wangchuk: పాక్ ఇంటెలిజెన్స్‌కు టచ్‌లో సోనమ్ వాంగ్‌చుక్!.. వెలుగులోకి సంచలనాలు
బీఆర్ఎస్ అడ్వకేట్స్ వర్సెస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్స్
1.కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి.ప్రకాశ్ గౌడ్
2.చింత ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య
3.చింత ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి
4.పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
రెండో విడుత మరో నలుగురు పార్టీమారిన ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్ లను విచారించనున్నట్లు సమాచారం. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇంకా స్పీకర్ కు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. వీరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి నెలకొంది. ఇప్పటికే దానం నాగేందర్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది.
న్యాయ నిపుణులతో సంప్రదింపులు
అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు. ఎవరికి వారుగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ చట్టంలో ఏవిధంగా ఉన్నాయనేదానిపైనా అధ్యయనం చేస్తున్నారు. స్పీకర్ కు ఇంకా ఏయే వివరాలు అందజేయాలని ఇరువురు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్న ఫొటోలు, వీడియోలు, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, పత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన క్లిప్పింగ్ లను బీఆర్ఎస్ సేకరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇరువురి వాదనలు విన్నతర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Also Read: Puri Sethupathi movie: పూరి, సేతుపతి సినిమా నుంచి మరో అప్డేట్.. టీజర్ లాంచ్ ఎక్కడంటే?