Kiran Abbavaram: ‘క’ మూవీ సక్సెస్ తర్వాత కిరణ్ అబ్బవరం (Hero Kiran Abbavaram) క్రేజే మారిపోయింది. ఇప్పుడాయన నటిస్తున్న కొత్త సినిమా ‘K-ర్యాంప్’ (K-Ramp). హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా, శివ బొమ్మాకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జైన్స్ నాని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. శనివారం ఈ సినిమా విశేషాలను తెలిపేందుకు చిత్రయూనిట్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..
ఎంతో కంఫర్ట్‌గా షూటింగ్ చేశాం
‘‘మేమంతా ‘K-ర్యాంప్’ చూశాం. ఈ సినిమా చూస్తూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్లం ఎంతగానో ఎంజాయ్ చేశాం. ఈ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ దీపావళికి థియేటర్స్‌కు వచ్చే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. టీమ్ అంతా ఎంతగానో సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ కారణంగానే సెట్స్‌లో ఎంతో కంఫర్ట్‌గా షూటింగ్ చేశాం. కథలో ఉన్న ఫన్‌ను సెట్స్‌లో కూడా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేశాం. నాకైతే మళ్లీ కాలేజ్‌కు వెళ్లిన వైబ్ కలిగింది. నిర్మాతలు రాజేశ్, శివలకు థ్యాంక్స్. హీరోయిన్ యుక్తికి ఇందులో హీరోతో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఉంది. తన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో నేను చిల్లరచిల్లరగా ఉంటా, యుక్తి క్యారెక్టర్ పిచ్చిది. వీళ్లిద్దరు కలిస్తే ఎంత ఫన్ క్రియేట్ అవుతుందనే దానికి థియేటర్స్ సాక్ష్యం కాబోతున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌లో ఇప్పటికే అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఇలాంటి పిచ్చి గర్ల్ ఫ్రెండ్ ఉంటే అందరికీ బూతులు వస్తాయి. నాకు కూడా అందుకే బూతులు వచ్చాయి.
Also Read- YSRCP: రికార్డుల నుంచి తొలగింపు కాదు.. సభలో క్షమాపణ చెప్పాలి.. బాలయ్య వివాదంపై వైసీపీ డిమాండ్
దర్శకుడు మహేష్ ఫ్యాన్.. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్
మ్యూజిక్ డైరెక్టర్ చేతన్‌తో నాకు ఇది మూడో చిత్రం. ‘ఎస్ఆర్ కల్యాణమండపం, వినరో భాగ్యము విష్ణు కథ’ తర్వాత ‘కె ర్యాంప్’తో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. ఆర్ఆర్‌తో మూవీ చూశాక చాలా చాలా హ్యాపీగా ఫీలయ్యా. నరేష్, సాయి కుమార్.. ఇలా మా ఆర్టిస్టులంతా సెట్‌లోకి రాగానే ఒక సూపర్ హిట్ మూవీకి వర్క్ చేస్తున్నామనే ఫీల్ వచ్చేసేది. నరేష్ సార్ మరోసారి తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తారు. మా దర్శకుడు జైన్స్ నాని మహేశ్ ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఈ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య ఉండే వార్ చాలా స్పెషల్‌గా ఉంటుంది. మళ్లీ వాళ్లే మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలా నేను, జైన్స్ నాని మంచి ఫ్రెండ్స్ అయ్యాం. తను కథ చెబుతున్నంత సేపూ నేనయితే నవ్వుతూనే ఉన్నాను. ఈ జర్నీలో నానిలాంటి ఇంకో బ్రదర్ పరిచయమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. మాములుగా అతన్ని చూస్తేనే నవ్వొస్తుంది. కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మూవీ చేసి ఒక వైబ్ క్రియేట్ చేయాలని అనుకున్నాం. అలాగే చేశాం.
Also Read- Suhas Family: మరో బిడ్డకు జన్మనిచ్చిన సుహాస్ భార్య.. ఫ్యామిలీలో సంతోషం
నేను మాటిస్తున్నా..
ఈ చిత్రంలో కుమార్ పాత్ర చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ప్రమోషనల్ కంటెంట్‌లోని ఒకట్రెండు డైలాగ్స్ చూసి సినిమాపై అభిప్రాయానికి రాకండి. ఈ మూవీ ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసేలా ఉంటుంది.. అందుకు నాది గ్యారెంటీ. సినిమాని చూస్తూ ఎక్కడా ఇబ్బంది పడరు. డబ్బున్న కుర్రాడు జాలీ లైఫ్ గడపాలని అనుకోవడం సహజమే. సినిమాపై క్రేజ్ క్రియేట్ చేసేందుకే ఆ ఎలిమెంట్‌ను ప్రమోట్ చేస్తున్నాం. పండుగకు వస్తున్న ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసి అంతా ఎంజాయ్ చేస్తారు. ‘నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి, వెంకీ, రెడీ..’ ఇలాంటి ఎంటర్‌టైనర్స్ మాదిరిగానే మా ‘కె ర్యాంప్’ చిత్రాన్ని రిపీటెడ్‌గా చూడాలని అనుకుంటారు. గత దీపావళికి అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఈ సారి మా ‘కె ర్యాంప్’ అందరినీ ఆకట్టుకుని, కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందని.. నేను మాటిస్తున్నా’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు