Wine Shops Close: బ్యాడ్ న్యూస్.. ఈ దసరాకి నో ముక్కా, నో చుక్కా!
Wine Shops Close (Image Source: twitter)
Telangana News

Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ దసరాకి నో ముక్కా, నో చుక్కా..!

Wine Shops Close: హిందూ పండుగల్లో దసరాకు ఒక ప్రత్యేక ఉంది. సాధారణంగా దసరా రోజున చాలా మంది మాంసాహారాన్ని ఆరగిస్తుంటారు. మద్యం ప్రియులు ఆ రోజు ఆల్కహాల్ సేవించి.. ఎంతో సరదాగా గడుపుతుంటారు. అయితే ఈ దసరాకు అలాంటి పరిస్థితి ఉండకవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది దసరా అక్టోబర్ 2న అంటే సరిగ్గా గాంధీ జయంతి (Gandhi Jayanthi) రోజున వచ్చింది. ఏటా గాంధీ జయంతి సందర్భంగా మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తుంటారు. దీంతో ఈసారి దసరా రోజున కూడా అవే ఆంక్షలు ఉండే అవకాశం ఉంది.

వైన్స్ బంద్ పక్కా!

అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు మూతపడనున్నాయి. ఇప్పటికే చాలా వరకూ వైన్స్ షాపుల్లో ‘అక్టోబర్ 2న వైన్స్ క్లోజ్’ అన్న బోర్డులు కనిపిస్తున్నాయి. నిజానికి ఇలాంటి బోర్డులు ఒక రోజు ముందు వైన్ షాపు నిర్వాహకులు ఏర్పాటు చేస్తుంటారు. కానీ దసరాను దృష్టిలో ఉంచుకొని ముందుగానే వారు కస్టమర్లను అప్రమత్తం చేస్తుండటం విశేషం. దసరా రోజున పెద్ద ఎత్తున వైన్స్ అమ్మకాలు జరుగుతాయని.. ఈసారి గాంధీ జయంతి రోజున పండుగ రావడం తమకు ఎదురు దెబ్బేనని వైన్ షాపు నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే మద్యాన్ని కొనుగోలు చేసి.. స్టాక్ పెట్టుకున్నారన్న ఉద్దేశ్యంతో అలర్ట్ ఫ్లకార్డులు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేస్తున్నారు.

మాంసం అమ్మకాలపై నిషేధం

ఏటా అక్టోబర్ 2వ తేదీన మాంసం అమ్మకాలపై కూడా ఆంక్షలు విధిస్తుంటారు. ఆ రోజున చికెన్, మటన్, ఫిష్, ఇతర మాంసాహారాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఈ దసరాకు కూడా మద్యం తరహాలోనే మాంసం అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Also Read: Pawan Kalyan: హైదరాబాద్‌లో అకస్మిక వరదలు.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం.. ఏమన్నారంటే?

నిషేధం ఎందుకు?

నేషనల్ హాలీడేస్ గా పేర్కొనే రిపబ్లిక్ డే (జనవరి 26), స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా మద్యం విక్రయాలపై ఆంక్షలు విధిస్తుంటారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చినందుకు గుర్తుగా గాంధీ జయంతి రోజున ఎలాంటి హింసకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో మద్యం నిషేధాన్ని ప్రతీ సంవత్సరం అమలు చేస్తూ వస్తున్నారు. అలాగే గాంధీజీ వెజిటేరియన్ కాబట్టి.. ఆయన జీవనశైలిని గౌరవించే ఉద్దేశ్యంతో మాంసాన్ని సైతం ఆ రోజున విక్రయించేందుకు అనుమతి లేదు. కాబట్టి అక్టోబర్ 2న ఎవరైన మద్యం, మాంసం విక్రయిస్తే చట్టపరంగా శిక్షార్హులు అవుతారని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read: TGSRTC: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఎంజీబీఎస్‌లో రాకపోకలు బంద్.. ఆర్టీసీ కీలక ప్రకటన

Just In

01

Nominated Posts: కొంచెం ఓపిక పట్టండి.. అందరికీ గుర్తింపు ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

Anvesh Controversy: యూట్యూబర్ అన్వేష్ ఈ సారి పెద్ద టార్గెట్టే పెట్టుకున్నాడు.. బత్తాయిల అంతు చూస్తాడంట..

CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గౌరవ మర్యాదలకు భంగం కలగనివ్వం: సీఎం రేవంత్

Education Reforms: కొత్త ఏడాదిలో ఉన్నత విద్యా రంగం కొత్త పుంతలు.. జరిగే మార్పులివే..!

Liquor Sales: ఎక్సైజ్ శాఖకు లిక్కర్ కిక్కు.. చివరి ఆరు రోజుల్లో రూ.1,350 కోట్ల ఆదాయం