TG Medical Council (imagecredit:twitter)
తెలంగాణ

TG Medical Council: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. ఆ డాక్టర్లపై వేటు..?

TG Medical Council: వైద్య వృత్తిలో నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన ఐదుగురు డాక్టర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్(Telangana Medical Council) కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి రిజిస్ట్రేషన్‌ను టెంపరరీగా రద్దు చేస్తూ చైర్మన్ డాక్టర్ మహేష్​, వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ప్రొఫెషనల్ కండక్ట్, ఎటిక్వెట్ అండ్ ఎథిక్స్) రెగ్యులేషన్స్ 2002, తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1968 ప్రకారం ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఐదుగురు డాక్టర్లు పది రోజుల్లోగా తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను కౌన్సిల్‌ కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్​భంగా కౌన్సిల్ మెంబరు డాక్టర్ రాజీవ్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజారోగ్య పరిరక్షణలో చారిత్రాత్మకమైన ముందడుగుగా కొనియాడారు.

వృత్తి దుర్వినియోగం, నైతిక ఉల్లంఘనలు, అర్హతలేని వ్యక్తులకు సహకారం చేయడం, తప్పుడు అర్హతలను ప్రదర్శించడం వంటి చర్యలపై కఠినమైన శిక్షలు విధించడం హర్షణీయమన్నారు. ఈ చర్యలు వైద్య వృత్తి గౌరవాన్ని నిలబెట్టడమే కాకుండా, రోగులకు నాణ్యమైన, సురక్షితమైన వైద్యం అందించడానికి కీలకంగా మారతాయన్నారు.

Also Read: Bathukamma Celebrations: వేలాదిమంది జానపద కళాకారులతో.. 30న ట్యాంక్ బండ్ పై బతుకమ్మ సంబురాలు

ఆ డాక్టర్లు వీళ్లే..

1. డాక్టర్ ఎ. చైతన్య రెడ్డి (రిజిస్ట్రేషన్ నెం. 54583), ఆక్సికేర్ హాస్పిటల్, ఈసీఐఎల్

భువనగిరిలో అర్హత లేని వైద్యులతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొని, వారికి స్పాన్సర్‌ గా వ్యవహరించినందుకు ఈయనపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ విధించారు.

2. డాక్టర్ ఎం. గౌతమ్ రెడ్డి (రిజిస్ట్రేషన్ నెం. 42594), ఓమ్ని హాస్పిటల్, కొత్తపేట

అర్హత లేని వైద్యులు నిర్వహించిన సమావేశానికి ఆసుపత్రి తరఫున స్పాన్సర్‌షిప్ అందించిన కారణంగా ఈయనపై ఆరు నెలల సస్పెన్షన్ వేటు పడింది.

3. డాక్టర్ కె.వి. మల్లికార్జున రావు (రిజిస్ట్రేషన్ నెం. 42599), ఎవ్యా హాస్పిటల్స్, వనస్థలిపురం

గుర్తింపు లేని వైద్యులతో కూడిన కార్యక్రమానికి స్పాన్సర్ చేసినందుకు ఈయనను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు.

4. డాక్టర్ కన్నయ్య తలపల్లి (రిజిస్ట్రేషన్ నెం. 59133), లివ్‌ యంగ్ క్లినిక్, జూబ్లీహిల్స్

అర్హతలు లేకున్నా తనను తాను కాస్మోటాలజిస్ట్ లేదా హెయిర్ ట్రాన్స్‌ ప్లాంట్ సర్జన్‌ గా తప్పుగా ప్రచారం చేసుకున్నందుకు ఈయనపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించారు.

5. డాక్టర్ కె. ఉమా మహేశ్వర్ (రిజిస్ట్రేషన్ నెం. ఏపీఎంసీ/ఎఫ్​ఎంఆర్/88902), పద్మావతి న్యూరో అండ్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్, సంగారెడ్డి

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆమోదం లేని, గుర్తింపు లేని వైద్య అర్హతలను ప్రదర్శించినందుకు ఈయనపై ఆరు నెలల సస్పెన్షన్ విధించారు.

Also Read: NRI Strugule: అమెరికాలో 11 ఏళ్ల అనుభవం.. ఎంత ట్రై చేసినా ఇండియాలో జాబ్ దొరకడం లేదంటూ ఆవేదన

Just In

01

MP Kadiyam Kavya: అభివృద్ధి పనులకు నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ కడియం కావ్య

Lokah Chapter 2: ‘కొత్త లోక చాప్టర్ 2’పై అప్డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో!

Bigg Boss Telugu Promo: ‘నీ లాంటి లత్కోర్ మాటలు మాట్లాడను’.. మాస్క్ మాన్‌పై నాగ్ మామ ఫైర్!

Jupally Krishna Rao: గోల్ఫర్లు ప్రీమియర్ గమ్యస్థానంగా హైదరాబాద్ తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

RV Karnan: బిల్డ్ డౌన్ టీడీఆర్‌లకు.. కమిషనర్ కర్ణన్ కీలక ఆదేశాలు!