BC Reservations (imagecredit:twitter)
Politics, తెలంగాణ

BC Reservations: బీసీలకు 42 శాతం రిజర్వేషన్.. ప్రత్యేక జీవో విడుదల చేసిన ప్రభుత్వం

BC Reservations: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై ప్రభుత్వం ప్రత్యేక జీవో రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల (రూరల్​, అర్బన్​) ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం జీవో నెంబరు 9 పేరిట విడుదల చేసింది. బీసీ కమిషన్(BC Commission), డెడికేషన్ కమిషన్, ప్లానింగ్ డిపార్ట్ మెంట్ రిపోర్టులతో పాటు అసెంబ్లీలో ప్రతిపక్షాల సహా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లు ఆధారంగా ఈ జీవోను తీసుకువచ్చారు.బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ జీవోను తక్షణమే అమలులోకి తెచ్చారు.రాజ్యాంగంలోని 243 డీ (6) ప్రకారం పంచాయతీల్లో బీసీ కోటాపై రాష్ట్రం నిర్ణయం తీసుకోవచ్చునని ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.అదే సమయంలో రాజ్యాంగంలోని 243 టీ(6) ప్రకారం మున్సిపాలిటీల్లో బీసీ కోటాపై రాష్ట్రానికి అధికారం ఉందని పేర్కొన్నది.దానికి అనుగుణంగా బీసీ(BC)ల రిజర్వేషన్ల పెంపును అమలు చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలలో ఒకటైన అణగారిన వర్గాల సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

కామారెడ్డి డిక్లరేషన్ అమలు..

కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో శ్రమించింది. ఇచ్చిన హామీని అమలు చేసేందుకు వివిధ ప్లాన్ లను అధ్యయనం చేసి, బీసీలకు 42 శాతం పక్కగా ఇచ్చేందుకు ముందుకు సాగుతుంది. తెలంగాణ(Telangana)లో బీసీల జనాభా, రాజకీయ ప్రాతినిధ్యంలో వారికున్న వెనకబాటును సమగ్రంగా పరిశీలించిన తర్వాత, స్థానిక సంస్థల్లో వారి సంక్షేమం, పురోగతి కోసం రిజర్వేషన్ల స్థాయిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇందులో భాగంగా “ది తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్) బిల్లు, 2025” ను అసెంబ్లీ, కౌన్సిల్​ రెండు సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. వాటి ఆధారంగానే ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: Bathukamma Kunta: బతుకమ్మ కుంట గ్రాండ్ ఓపెనింగ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్సవాలు

సమగ్ర శాస్త్రీయ డేటాను..

గతేడాది ఫిబ్రవరి లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల (సీసీఈపీసీ) సర్వే కీలకంగా మారినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బీసీల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్​ ఛైర్మెన్​గా బీసీ డెడికేటెడ్​ కమిషన్​ను ఏర్పాటు చేసింది. కుల గణన సర్వేలో లభించిన సమగ్ర శాస్త్రీయ డేటాను డెడెడికేటేడ్​ కమిషన్​ కు అందించి, విశ్లేషించాలని కోరింది. ఈ కమిషన్ క్షుణ్ణంగా పరిశోధించి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి అవసరమైన గణాంకపరమైన ఆధారాలను సమకూర్చింది. కులగణన డేటాను విశ్లేషించిన డెడికేటెడ్ కమిషన్ కొన్ని సిఫార్సులుచేసింది.56.33 శాతం మంది ఉన్న బీసీ కులాలు జనాభా స్థాయిలో ఎదగలేకపోయారని,ఈ గ్యాప్​ను పూడ్చడానికి, వెనుకబాటుతనం వాస్తవ స్థితిని పరిగణనలోకి తీసుకుని వారికి రాజకీయంగా, స్థానిక సంస్థల్లో కనీసం 42 శాతం కోటా కల్పించాలని సిఫార్సు చేసింది.

కాంగ్రెస్ లో జోష్​..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో కాంగ్రెస్ నేతల్లో జోష్​ నెలకొన్నది. బీసీలకు న్యాయం చేసేందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ బృందానికి పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా బీసీలకు రాజ్యాధికారం దక్కనున్నదని హర్షం వ్యక్తం చేశారు.

Also Read: Viral News:హెల్త్ బాలేక ఒక్క రోజు లీవ్ తీసుకున్న బ్యాంక్ ఉద్యోగికి హెచ్చార్ నుంచి అనూహ్య మెసేజ్

Just In

01

VC Sajjanar: హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్.. ఆయన పోలీస్ కెరీర్ గురించి.. ఈ విషయాలు తెలుసా?

MP Kadiyam Kavya: అభివృద్ధి పనులకు నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ కడియం కావ్య

Lokah Chapter 2: ‘కొత్త లోక చాప్టర్ 2’పై అప్డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో!

Bigg Boss Telugu Promo: ‘నీ లాంటి లత్కోర్ మాటలు మాట్లాడను’.. మాస్క్ మాన్‌పై నాగ్ మామ ఫైర్!

Jupally Krishna Rao: గోల్ఫర్లు ప్రీమియర్ గమ్యస్థానంగా హైదరాబాద్ తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు