Balineni: పవన్ సినిమాలపై చేసిన వ్యాఖ్యలకు బాలినేని క్లారిటీ!
Pawan and Balineni
ఎంటర్‌టైన్‌మెంట్

Balineni: అది అవాస్తవం.. పవన్ కళ్యాణ్ సినిమాలపై చేసిన వ్యాఖ్యలకు బాలినేని క్లారిటీ!

Balineni: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ సినిమా (OG Movie) థియేటర్లలో విజయ ఢంకా మోగిస్తుంది. విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. సెలబ్రిటీలు ఎందరో ఈ సినిమాను ప్రీమియర్ షో ద్వారా వీక్షించారు. ఏపీకి చెందిన పొలిటికల్ లీడర్స్ కూడా ఈ సినిమాను చూసి, టీమ్‌ని అభినందించారు. ఈ క్రమంలో జనసేన నేత బాలినేని శ్రీనివాసరావు (Balineni Srinivasa Reddy).. సినిమా చూసిన అనంతరం చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. కేవలం వైరల్ అవడమే కాదు.. కాంట్రవర్సీగా కూడా మారాయి. తన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. నేను అననీ మాటలను కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చారు. నేను అక్కడ అన్నది వేరు.. అందరూ చూపిస్తున్నది, వాటిపై చర్చలు జరుపుతున్నది వేరని ఆయన వివరణ ఇచ్చారు.

Also Read- NRI Strugule: అమెరికాలో 11 ఏళ్ల అనుభవం.. ఎంత ట్రై చేసినా ఇండియాలో జాబ్ దొరకడం లేదంటూ ఆవేదన

అసత్య ప్రచారానికి ముగింపు పలకండి

అసలు వినిపిస్తున్న వార్తలు ఏమిటంటే.. సినిమా చూసిన అనంతరం.. ‘ఓజీ’ సినిమా అద్భుతంగా ఉందని, ఇంకా ఒక్క సినిమా మాత్రమే ఆయన చేస్తారని, అనంతరం పూర్తి స్థాయిలో ఆయన పాలిటిక్స్‌లో బిజీ అవుతారని చెబుతున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. దీనిపై ఆయన వివరణ ఇస్తూ.. పవన్ కళ్యాణ్ ఇది కాకుండా ఇంకా ఒక్క సినిమానే చేస్తారని నేను మాట్లాడినట్టు ప్రచారం జరుగుతుంది. కానీ, అది అవాస్తవం. పవన్ కళ్యాణ్ మరో 25 సంవత్సరాలు సినిమాలు చేయాలని, ప్రజలని అలరించాలని.. అటు రాజకీయంగా ఇటు చలనచిత్ర రంగం పరంగా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకునే వారిలో నేను మొదటి వాడిని. పవన్ కళ్యాణ్‌తో ఒక సినిమా నిర్మిద్దామని ఆలోచనలో నేనున్నాను… ఆయన నా కోరికని తీరుస్తారనే నమ్మకం కూడా నాకు ఉంది. దయచేసి నా మాటలు వక్రీకరించకండి.. ఇంతటితో ఈ అసత్య ప్రచారానికి ముగింపు పలకండని కోరారు.

Also Read- Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ ప్రీ-రిలీజ్ వేడుకకు వస్తున్న గెస్ట్ ఎవరో తెలుసా?

సరికొత్త రికార్డుల దిశగా..

ఇదిలా ఉంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు (Pawan Kalyan Fans) ‘ఓజీ’ సినిమా చూసి చొక్కాలు చించేసుకుంటున్నారు. అంతగా వారికి ఈ సినిమా నచ్చేసింది. సోషల్ మీడియా, ఇంకా అక్కడక్కడా నెగిటివ్ ప్రచారం నడుస్తున్నా, కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పే దిశగా దూసుకెళుతోంది. అభిమానులు ఈ సినిమాతో చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు థమన్‌లకు గుడి కట్టడానికి సిద్ధం అన్నట్లుగా వారి ఆనందం ఉందంటే.. ఏ స్థాయిలో వారు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: బీజేపీలోని ఏ ఒక్క‌నాయ‌కుడైనా దేశం కోసం త్యాగం చేశారా? : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

Sridhar Babu: మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి!

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్