Mirai Movie
ఎంటర్‌టైన్మెంట్

Mirai Movie: ‘మిరాయ్’కి ‘వైబ్’ యాడయింది.. ఇక కుర్రాళ్లకు పండగే!

Mirai Movie: యువ కథానాయకుడు, సూపర్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మిరాయ్’ (Mirai Movie) ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శించబడుతోన్న విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమా కొన్ని చోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో, హై-వోల్టేజ్ యాక్షన్‌తో, విజువల్ ఫీస్ట్‌లా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా కుర్రకారుకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వడానికి చిత్రయూనిట్ సిద్ధమైంది. ‘ఓజీ’ సినిమా విడుదలను పురస్కరించుకుని సెప్టెంబర్ 25న ‘మిరాయ్’ ప్రదర్శించబడుతున్న కొన్ని థియేటర్లను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆ సినిమాకు కేటాయించిన విషయం తెలిసిందే. మళ్లీ నార్మల్‌గా ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

Also Read- Metro Fest 2025: దసరా స్పెషల్.. మెట్రోలో ఫ్రీ ఫుడ్ స్టాల్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్.. హైదరాబాదీలకు పండగే!

ఈ వీకెండ్ నుంచే..

ఇక ‘మిరాయ్’ సినిమా రిలీజ్ కాక ముందు అత్యంత ప్రజాదరణ పొందిన పాటల్లో ఒకటిగా ‘వైబ్ ఉంది’ పాట (Vibe Undi Song) నిలిచింది. సినిమా రిలీజ్ తర్వాత ఈ పాట థియేటర్లలో లేకపోవడంతో చాలా మంది, ముఖ్యంగా కుర్రకారు బాగా డిజప్పాయింట్ అయ్యారు. అలా డిజప్పాయింట్ అయిన వారందరినీ మళ్లీ థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. థియేటర్లలో ఈ పాటను యాడ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ శనివారం (సెప్టెంబర్ 27) నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ‘మిరాయ్’ సినిమాలో ఈ ఎనర్జిటిక్ పాటను అదనంగా యాడ్ చేయనున్నారు. ఈ నిర్ణయంతో సినిమాకు మరింత మాస్ అప్పీల్ వస్తుందని, ముఖ్యంగా యూత్‌ను ఈ సాంగ్ మరింతగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం భావిస్తోంది.

Also Read- Balakrishna Controversy: బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి- అఖిల భారత చిరంజీవి యువత

మేకర్స్ లక్ష్యమిదే..

‘వైబ్ ఉంది’ పాట విడుదలైనప్పటి నుంచీ మ్యూజిక్ లవర్స్‌ను, సోషల్ మీడియా యూజర్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. దీని ట్యూన్, లిరిక్స్, హీరోహీరోయిన్ల డ్యాన్స్, విజువల్స్ అన్నీ కలిసి ఈ సాంగ్‌ను ఒక చార్ట్‌బస్టర్‌గా నిలిపాయి. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మిరాయ్’లో ఈ మాస్ సాంగ్‌ను యాడ్ చేయడం ద్వారా, థియేటర్లలోని ప్రేక్షకులకు ఒక కొత్త ఉత్సాహాన్ని, ‘వైబ్’ను అందించాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తేజ సజ్జా కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX), థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను ఒక కొత్త తరహా కథనంతో రూపొందించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విలన్‌గా కనిపించిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Heroines: ఈ ఇద్దరు హీరోయిన్లు ఎంత దురదృష్టవంతులంటే..

Jubilee Hills Bypoll: బీజేపీలో ట్విస్ట్‌.. జూబ్లీహిల్స్ అభ్యర్థిని తానేనంటూ ప్రచారం.. లీడర్స్ షాక్!

Allu Arjun: ఐకాన్ స్టార్ సర్‌ప్రైజ్.. ‘ఓజీ’ చూసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్!

Balineni: అది అవాస్తవం.. పవన్ కళ్యాణ్ సినిమాలపై చేసిన వ్యాఖ్యలకు బాలినేని క్లారిటీ!

New DGP: నిజమైన ‘స్వేచ్ఛ’ కథనం… తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి