Viral Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా… కొన్ని సీరియస్ గా.. మరి కొన్ని అద్భుతంగ, ఇంకొన్ని షాకింగ్ గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే భయంకరంగా కూడా ఉంటాయని చెప్పొచ్చు. అయితే, వాటిలో కొన్ని మాత్రం బాగా వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్స్ లో వైరల్ అయ్యే వీడియోస్ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. పని చేస్తున్న సమయంలో కూడా ఫోన్స్ చూస్తూ అలాగే ఉండిపోతున్నారు. మరి ముఖ్యంగా, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అనే ఫీచర్ వచ్చాక చాలా మంది తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.
ప్రపంచంలో (World) ఏం జరిగినా క్షణాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. ఈ మధ్య ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాం. ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిని వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా రోజు నెట్టింట కొన్ని వేల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. మనం ఇప్పటి వరకు మనుషులు హెల్మెట్ పెట్టుకోవడం చూశాము. చిలుక హెల్మెట్ పెట్టుకోవడం చూశారా? ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా.. ఇది నిజం. ఆ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
ఓ రామ చిలుక సైకిల్ తొక్కుతుంది. ఇదేంటి చిలుక సైకిల్ తొక్కడం ఏంటని షాక్ అవుతున్నారా? నిజం ఓ చిలుక తన తలకి హెల్మెట్ పెట్టుకుని, మనిషి ఏ విధంగా అయితే.. సైకిల్ తొక్కుతాడో అది కూడా అలాగే తొక్కుతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంకా ఎన్ని చూడాలో ఏంటో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.