New Liquor Shops: రాష్ట్రంలో కొత్త వైన్ షాపుల కోసం గురువారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. నేటి నుంచి అక్టోబర్ అక్టోబర్ 18వ తేదీ వరకు తీసుకోనున్నారు. ఆ తరువాత అయిదు రోజులకు ఆయా వైన్ షాపులను ఎవరెవరికి కేటాయించాలన్న దానిపై రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో లాటరీ నిర్వహించనున్నారు. ఇక, షాపులను దక్కించుకున్న వారు అక్టోబర్ 23, 24వ తేదీల్లో లైసెన్స్ ఫీజులోని మొదటి వాయిదాను చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త షాపులను తెరుచుకోవచ్చు.
2027, నవంబర్ 30వ తేదీ వరకు లైసెన్స్ కాలపరిమితి ఉంటుంది. ఇక, దరఖాస్తు రుసుమును 3లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇక, లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఆరు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటును కల్పించారు. 1968 ఎక్సయిజ్ చట్టం ప్రకారం కేసుల్లో శిక్షలు పడిన వారు వైన్ షాపులు పొందటానికి అనర్హులు. రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్ షాపులు ఉండగా వీటిలో గౌడ్ లకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం కేటాయించారు.
Also Read: Jagapathi Babu: రూ. 800 కోట్ల మోసం.. ఈడీ విచారణకు జగపతి బాబు
హైదరాబాద్ జిల్లాలో కొత్త మద్యం షాపుల కేటాయింపులు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలతోనే కేటాయింపులు జరపాలన్న జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఆదేశాల మేరకు డ్రా పద్దతి ద్వారా షాపులు కేటాయింపులు చేపట్టడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి తెలిపారు. కలెక్టరేట్ లోని వీడియోకాన్ఫరెన్స్ హాల్ లో హైదరాబాద్ జిల్లా పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్‌లలో ఎస్సీ, ఎస్టీ, గౌడ్, జరనల్ కోటాలలో టోకెన్ సిస్టం ద్వారా డ్రా పద్ధతిని ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్. పంచాక్షరి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ ఎన్. శ్రీనివాసరావు లతో కలసి పాల్గొని డ్రా నిర్వహించినట్లు తెలిపారు.
Also Read: CM Revanth Reddy: తమిళనాడు మోడల్‌లో తెలంగాణ విద్యా రంగం.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మొత్తం 82 షాపులు కేటాయించడం జరిగింది
హైదరాబాద్ డివిజన్ పరిధిలోని ఎస్సీలకు 4 షాపులు, ఎస్టీలకు ఒకటి, గౌడ్ లకు 5, అలాగే జనరల్ కేటగిరీలో 72 షాపులతో కలిపి మొత్తం 82 షాపులు కేటాయించడం జరిగిందని తెలిపారు. అలాగే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఎస్సీలకు 7 షాపులు, ఎస్టీలకు ఒకటి, గౌడ్ లకు 6 అలాగే, జనరల్ కేటగిరీలో 83 షాపులతో కలిపి మొత్తం 97 షాపుల కేటాయింపులు జరిగినట్లు వెల్లడించారు. ఈ డ్రా పద్ధతిని ఎస్సీ,ఎస్టీ సంక్షేమ అధికారులు, ఎక్సైజ్ అధికారుల సమక్షంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులు ప్రవీణ్ కుమార్, కోటాజి, ఎక్సైజ్ అధికారులు తదితరలు పాల్గొన్నారు.
Also Read: Bathukamma Kunta: బతుకమ్మ కుంట గ్రాండ్ ఓపెనింగ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్సవాలు