Komatireddy Venkat Reddy: యువతలో స్కిల్ డెవలప్ మెంట్ పెంచి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పరచడమే ప్రజాప్రభుత్వ ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్రపతి చే అవార్డు అందుకున్న న్యాక్ సీనియర్ ఇన్ స్ట్రక్టర్ స్నేహలతను మంత్రి అభినందించారు.సెప్టెంబర్ 5న టీచర్స్ డే పురస్కరించుకొని ఢిల్లీలో రాష్ట్ర పతి చేతుల మీదుగా జాతీయ అవార్డు (National Award) అందుకున్న న్యాక్ సీనియర్ ఇన్ స్ట్రక్టర్ స్నేహలత మంత్రిని మంత్రుల నివాస సముదాయంలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ విభాగంలో ఉత్తమ టీచర్స్ అవార్డు (Best Teacher Award) అందుకున్న ఆమెను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
Also Read: Warangal Land Scam: ప్రైవేట్ పట్టా చూపి ప్రభుత్వ భూమి కాజేసేందుకు కుట్ర చేసిన బడా వ్యాపారి
స్కిల్ డెవల్మపెంట్ పెంపొందించాలనే లక్ష్యం
శాలువాతో సత్కరించి,ఆమె పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన అందించిన సేవలను మెచ్చుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్ష న్ ను అత్యుత్తమ స్కిల్ డెవల్మపెంట్ వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు విద్యార్థుల్లో స్కిల్ డెవల్మపెంట్ పెంపొందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవల్మపెంట్(Skill Development) సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.
హన్మకొండకు చెందిన నక్క స్నేహలతకు అవార్డు
ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా, (Warangal District) కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లో నిరుద్యోగ యువతకు సర్టిఫికెట్ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు కల్పించే వృత్తివిద్యా కోర్సులను అందిస్తూ, ఉత్తమ బోధన అందించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని మంత్రి కొనియాడారు. దేశ వ్యాప్తంగా 13 మంది ఈ వార్డుకు ఎంపికైతే తెలంగాణ నుండి న్యాక్ ఇన్ స్ట్రక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న హన్మకొండకు చెందిన నక్క స్నేహలతకు అవార్డు రావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వ కారణం అన్నారు.నల్గొండలో అధునాతన హంగులతో నూతనంగా నిర్మిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అతి త్వరలో అందుబాటులోకి రానుందని,ఉమ్మడి జిల్లా యువతలో ప్రపంచంతో పోటీపడే నైపుణ్యం పెంపొందించేందుకు ఈ సెంటర్ ఉపయోగపడనుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Also Read: Warangal District: ఈఎస్టీఐసి-2025 ప్రతిష్టాత్మక సదస్సుకు.. వరంగల్ వాసి ఎంపిక!