Cyber criminals Digital Arrest : డిజిటల్ అరెస్ట్ తో ..నో ‘రెస్ట్’
Digital arrest cheating
క్రైమ్

Hyderabad:డిజిటల్ అరెస్ట్ తో ..నో ‘రెస్ట్’

Cyber criminals new type Digital Arrest threatening consumers: ఎప్పటికప్పుడు క్రైమ్ తన రూపం మార్చుకుంటోంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక దాని వల్ల వచ్చే మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. పది సంవత్సరాల క్రితం క్రైమ్ నేరాలు వేరు. ప్రస్తుతం జరగుతున్న క్రైమ్ వేరు. ఆన్ లైన్‌లో విచ్చలవిడిగా మోసాలు జరుగుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల పిన్ నెంబర్లు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి వినియోగదారుల డబ్బులు కొట్టేయడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించడం రోజూ చూస్తునే ఉంటాం. నిత్యం డేటా చౌర్యం చేసి మన ఖాతాల మీద డబ్బులు సంపాదించుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఒక్కోసారి బడా సంస్థల కంప్యూటర్లు సైతం హ్యాక్ చేసి వారి ఖాతాలను స్తంభింపజేస్తూ బెదిరిస్తూ డబ్బులు గుంజడం లాంటి నేరాలు ఇప్పుడు సరికొత్త రీతిగా ‘డిజిటల్ అరెస్ట్’ రూపంలో వెలుగు చూస్తున్నాయి.

డిజిటల్‌ అరెస్ట్‌ అంటే!

సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్‌ చేసి తాము పోలీసులమనో, దర్యాప్తు అధికారులమనో నమ్మిస్తారు. బ్యాంకు ఖాతా, సిమ్‌ కార్డు, ఆధార్‌ కార్డు వంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని బెదిరిస్తారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అక్కడి నుంచి కదలటానికి వీల్లేదని కట్టడి చేస్తారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెబుతారు. వారి ఖాతాలోకి డబ్బులు జమయ్యాక విడిచిపెడతారు. ఇలా మనిషిని ఎక్కడికీ వెళ్లనీయకుండా, ఒకరకంగా అరెస్ట్‌ చేసినట్టుగా నిర్బంధించటమే ‘డిజిటల్‌ అరెస్ట్‌’. డిజిటల్‌ అరెస్ట్‌ కొత్త సైబర్‌ నేరం కావటం వల్ల ప్రజలు దీన్ని పోల్చుకోవటం కష్టమైపోతోంది. దర్యాప్తు అధికారులమని తొందర పెట్టటం వల్ల కంగారుపడి, ఏది ఎక్కడికి దారితీస్తోందనే భయంతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల మనదేశంలో వెలుగులోకి వచ్చిన ఘటనలే దీనికి నిదర్శనం.

మనీ ల్యాండరింగ్ అంటూ బెదిరింపులు

ఇటీవల హైదరాబాద్ కు చెందిన మహిళకు ఒకరు ఫోన్‌ చేసి, తాను దర్యాప్తు అధికారినని చెప్పాడు. ‘మీ ఆధార్‌ కార్డుతో సిమ్‌ కొన్నారు. దాన్ని ముంబయిలో మనీ లాండరింగ్‌ కోసం వాడుకున్నారు’ అని బెదిరించాడు. దర్యాప్తు అనేసరికే ఆమె హడలిపోయారు. దీన్ని గుర్తించిన నేరగాడు మరింత రెచ్చిపోయాడు. తదుపరి విచారణ కోసం కాల్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అవతలి నుంచి మరో నేరగాడు తాను ముంబయి పోలీసు అధికారినని చెప్పి విచారణ ఆరంభించాడు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ నిరంతరాయంగా స్కైప్‌ కాల్‌ చేశాడు. అంతసేపూ ఆమెను అక్కడి నుంచి కదలనీయలేదు. అతడి ఖాతాలోకి 12 లక్షలను ట్రాన్స్ఫర్ చేసుకున్ానక గానీ కాల్ కట్ చేయలేదు. చివరికి తాను మోసపోయానని ఆ మహిళ గుర్తించి సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.

ఏం చేయాలంటే?

భారతీయ చట్టాల్లో ఇప్పటివరకూ ‘డిజిటల్‌ అరెస్ట్‌’ అనేదే లేదన్న సంగతి తెలుసుకోవాలి. ఎవరైనా దర్యాప్తు అధికారులమని చెప్పి, విచారణ చేస్తున్నామంటే భయపడొద్దు. వెంటనే కాల్‌ను కట్టేయాలి. మరోసారి ఆలోచించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లకు విషయాన్ని తెలియజేయాలి. సాధారణంగా ప్రభుత్వ సంస్థలు గానీ అధికారులు గానీ కాల్‌ చేసి బెదిరించటం, భయపెట్టటం చేయరు. కాబట్టి అలాంటి కాల్‌ వస్తే దాన్ని గుర్తించాలి. వారి విశ్వసనీయతను ధ్రువీకరించుకోవాలి. మరీ ఎక్కువగా బెదిరిస్తే అన్ని వివరాలతో నోటీసు పంపించమని అడగాలి. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వారిని కలుస్తానని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్య సమాచారాన్ని వెల్లడించొద్దు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా, పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డుతో ముడిపడిన వివరాలను ఇవ్వవద్దు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..