Constable Jobs: దసరా పండగ సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తూ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 7,565 ఖాళీలు ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ కానున్నాయి. దీనిలో మాజీ సైనికుల కోసం ప్రత్యేక రిజర్వేషన్ పోస్టులు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 22, 2025 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు
నోటిఫికేషన్ తేదీలు:ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 22, 2025
ఆన్‌లైన్ దరఖాస్తు గడువు: అక్టోబర్ 21, 2025
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: అక్టోబర్ 22, 2025
దరఖాస్తు సవరణ విండో: అక్టోబర్ 29, 2025 నుంచి అక్టోబర్ 31, 2025
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: డిసెంబర్ 2025 లేదా జనవరి 2026
అర్హత
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PwBD వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హత: 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE): అభ్యర్థులు మొదట ఆన్‌లైన్ రాత పరీక్షలో పాల్గొనాలి.
శారీరక సామర్థ్యం & కొలత పరీక్ష (PE & MT): CBEలో అర్హత సాధించినవారు శారీరక పరీక్షలకు హాజరవుతారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: తుది ఎంపికకు ముందు డాక్యుమెంట్ తనిఖీ ఉంటుంది.
పోస్టుల వివరాలు
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) – పురుషులు: 4,408
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) – మహిళలు: 2,496
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) – మాజీ సైనికులు (కమాండో): 376
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) – మాజీ సైనికులు (ఇతరులు): 285
మొత్తం ఖాళీలు: 7,565
దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరీ: రూ.100 ను చెల్లించాలి.
మహిళలు, SC/ST, మాజీ సైనికులు: ఎటువంటి ఫీజు అవసరం లేదు
చెల్లింపు విధానం: UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inని సందర్శించండి.
2. “ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025” నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి.
4. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన పత్రాలు (ఫోటో, సంతకం, విద్యార్హత సర్టిఫికెట్లు) అప్‌లోడ్ చేయండి.
5. ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.
6. చివరిగా దరఖాస్తు ఫారమ్ ప్రింట్ తీసుకోండి.