Ambati Rambabu comments: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాపై చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓజీ విడుదల సందర్భంగా అంబటి మాటలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఏం అన్నారంటే.. ‘ముందుగా ఈ సినిమా హిట్ అవ్వాలని కొరుకుంటున్నాను. ఎందుకంటే అంతటి హైప్ ఉంది కాబట్టి. గత రెండు సినిమాలు సరిగా ఆడకపోండంతో ఈ సారి పవన్ మంచి కసిమీద ఉన్నారు. దర్శకుడు కూడా అదే కసితో ఈ సినిమాను తీశారు. అంటూనే టికెట్లు విషయంలో వెయ్యి రూపాయలు పెట్టి ప్రజలను దోచుకోవడం ఎంత వరకూ సమంజసం’ అంటూ ప్రశ్నించారు. ‘ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మీరు ఇలా చేయడం కరెక్టు’ కాదన్నారు. అంతే కాకుండా ‘‘ఓజీ’ సినిమా మంచి విజయం సాధించి సినిమా హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని, కొణెదల కుటుంబానికి గౌరవం తీసుకురావాలని’ ఆకాంక్షించారు. ఇందులో వ్యంగ్యంగా కూడా కొన్ని మాటలు అన్నారు. అవి.. ‘పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పనులు అన్నీ పక్కన పెట్టి ఈ సినిమా తీయడంలో సహకరించడంతో ఈ సినిమా బాగా వచ్చిందని’ వ్యంగ్యంగా మాట్లాడారు. దీనిని చూసిన పవన్ అభిమానులు అంబటి మాటలు తక్కువగా మాట్లాడితే మంచిది అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అంబటి దీంతో ఆగకుండా ట్విటర్ లో ఇదే విషయాన్ని రాసుకొచ్చారు.
పవన్ జి… "OG"
సూపర్ డూపర్ హిట్టై
దానయ్యకు దండిగా ధనం
రావాలని కోరుకుంటున్నాను !@DVVMovies @PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) September 24, 2025
Read also-Accenture Campus: ఏపీకి గుడ్ న్యూస్.. 12వేల ఉద్యోగాలతో.. టాప్ గ్లోబల్ కంపెనీ వచ్చేస్తోంది!
సినిమా కోర్ స్టోరీ ఎంటంటే.. ఒక గ్యాంగ్‌స్టర్ రిటర్న్ చుట్టూ తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్లే చేసే ‘ఓజస్ గంభీర’ (Ojas Gambheera) అనే క్యారెక్టర్, 10 సంవత్సరాల తర్వాత ముంబైకి తిరిగి వస్తాడు. ఆయన ముందు గ్యాంగ్ లైఫ్‌లో ఒక పాత శత్రువుతో (ఎమ్రాన్ హాష్మీ ప్లే చేసే ‘ఓమి భావు’) సెటిల్ చేసుకోవాలని మనసులో పెట్టుకుని, రివెంజ్ మిషన్‌లో ఎంబార్క్ అవుతాడు. ఇది కేవలం యాక్షన్ కాదు – ఇది భావోద్వేగాలతో కూడిన డార్క్ డ్రామా. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, బాడీ లాంగ్వేజ్, అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ ఇంటెన్సిటీ – ఇవన్నీ స్క్రీన్ మీద అభిమానులకు కావాల్సినట్టుగా ఉంటాయి.
Read also-OG premiere: పవన్ కళ్యాణ్ కోసం ‘మిరాయ్’ ప్రొడ్యూసర్ ఏం చేశాడంటే?.. ఫ్యాన్స్‌కు పండగే..
‘ఓజీ’ సినిమా వెనుక ఉన్న క్రూ ఒక స్టార్ టీమ్ చిత్రాన్ని భారీ విజువల్ ఫీస్ట్‌గా మార్చింది. డైరెక్టర్ సుజీత్, ‘సాహో’ ఫేమ్‌తో, స్టైలిష్ యాక్షన్, గ్రిప్పింగ్ నరేషన్‌తో మ్యాజిక్ చేశాడు. ప్రొడ్యూసర్ డి.వి.వి. దానయ్య, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్‌ను తీసిన అనుభవంతో, రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్ చేత అద్భుతమైన విజువల్స్‌తో, ఎడిటింగ్ నవీన్ నూలి చేత క్రిస్ప్‌గా రూపుదిద్ధుకుంది. థమన్ ఎస్ మ్యూజిక్ మాస్ బీట్స్‌తో స్క్రీన్‌ను షేక్ చేసేలా కంపోజ్ చేశారు. స్క్రిప్ట్ రైటర్స్ సైనాధ్ అల్లా, సుజీత్ కలిసి, ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు బలమైన కథనాన్ని అందించారు. ఈ టీమ్‌వర్క్ ‘ఓజీ’ని ఒక ఐకానిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది.