Carlos Alcaraz Triumphs Over Jannik Sinner To Reach 2024 French Open Final: ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కారజ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. నువ్వా నేనా అన్నట్లుగా ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ సెమీ ఫైనల్స్‌లో ఇటలీ టెన్నిస్ ప్లేయర్ జానిక్ సినర్‌పై అల్కారజ్ 2-6,6-3,3-6,6-4,6-3 తేడాతో విజయం సాధించాడు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించిన అల్కారజ్ తన కెరీర్‌లో మూడో టైటిల్‌పై కన్నేశాడు. 21 ఏళ్ల అల్కారజ్ 2022లో యూఎస్ ఓపెన్, 2023లో వింబుల్డన్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. అయితే మనోడు ఓ అరుదైన ఘనత సాధించాడు. మూడు కోర్టులపై టైటిల్ ఫైట్‌కు చేరిన అత్యంత పిన్న వయస్కుడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. 2022లో హార్డ్ కోర్ట్ యూఎస్ ఓపెన్, గతేడాది గ్రాస్ కోర్ట్ వింబుల్డన్ టైటిళ్లను అందుకున్నాడు.
Also Read: మహిళల ఆసియా టోర్నమెంట్‌కి శ్రీలంక ఆతిథ్యం
అయితే తొలి సెట్‌లో అల్కారజ్ వెనుకంజలో నిలిచాడు. రెండో సీడ్ సినర్ ఆది నుంచి దూకుడు ప్రదర్శించి మొదటి సెట్‌లో 4-0తో ఆధిపత్యం చెలాయించాడు. ఆ తర్వాత అల్కారజ్ ప్రతిఘటించి సెట్‌ను 2-6తో కోల్పోయాడు. అదే పోరాట పటిమను కొనసాగిస్తూ రెండో సెట్‌ను గెలిచాడు. కానీ మూడో సెట్‌లో సినర్‌పై చేయి సాధించడంతో పోరు రసవత్తరంగా కొనసాగింది. కాగా, అల్కారజ్ ఎలాంటి పొరపాటు చేయకుండా చివరి రెండు సెట్‌లలో పైచేయి సాధించి సెమీస్ నెగ్గాడు.