Chhattisgarh Encounter (IMAGE credit: swetcha reporter or twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Chhattisgarh Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తెలుగు అగ్రనేతలు హతం

Chhattisgarh Encounter: మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh Encounter) దండకారణ్యంలో భద్రత బలగాలు మావోయిస్టులకు మధ్య  జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందారు ఇద్దరు తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా చెందిన ఇద్దరు నేతలు మృతి చెందారు. మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్ సరిహద్దు నారాయణపూర్ జిల్లా వద్ద అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారంతో ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర భద్రత బలగాలు సంయుక్తంగా ఆ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి.

ఈ క్రమంలో మావోయిస్టులకు భద్రత బలగాలకు కొన్ని గంటల పాటు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్కౌంటర్లో ఇద్దరు తెలంగాణ చెందిన మావోయిస్టు అగ్ర నేతలు కడారి సత్యనారాయణరెడ్డి కట్టా రామచంద్ర రెడ్డిలు మృతి చెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లెకు చెందిన కడారి సత్యనారాయణ రెడ్డి, సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగల కుంట పల్లె చెందిన కట్టా రామచంద్రారెడ్డి,లు మృతి చెందారు. కేంద్ర కమిటీలో కీలకంగా పనిచేసిన సత్యనారాయణ రెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి ల మరణం మావోయిస్టులకు తీరని నష్టం జరిగింది. సత్యనారాయణ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి, తల్లి అన్నమ్మ లు గతంలోనే మృతి చెందారు.

 Also Read: CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు దసరా కానుక.. బోనస్ ప్రకటించిన సర్కార్ ఒక్కొక్కరికి ఎన్ని లక్షలంటే..?

సత్యనారాయణ రెడ్డి నేపద్యం!

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లి చెందిన కడారి సత్యనారాయణ రెడ్డి చిన్న వయసులోని అన్నలతో కలిసి అడవులకు వెళ్ళాడు. ఆఖరి సంతానమైన కడారి సత్యనారాయణ రెడ్డి కమ్యూనిస్టు బావాజలం కలిగి ఉండడంతో చదువుకుంటున్న సమయంలోనే అడవి బాట పట్టాడు. పెద్దపల్లి జిల్లాలో ఐటిఐ చేస్తున్న సమయంలో ఓ గొడవలో హత్య జరగgaa తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇక అప్పటినుంచి ఇంటి వైపు కూడా చూడలేదు . సత్యనారాయణ రెడ్డి సిరిసిల్లలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు.

అనంతరం పెద్దపల్లిలో ఐటిఐ పూర్తి చేశారు బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరిన సత్యనారాయణ రెడ్డి, కార్మికుల హక్కుల కోసం ఉద్యమించారు ఈ క్రమంలో సిమెంట్ ఫ్యాక్టరీ మేనేజర్ హత్య గురికాగా ఆ కేసులో సత్యనారాయణ రెడ్డి జైలుకు వెళ్లాడు జైలు నుంచి వచ్చాక అప్పటి సింగరేణి కార్మిక సమాఖ్య (సికాసా)లో పనిచేస్తూ పీపుల్స్ వార్ లో చేరారు. 1980 ప్రాంతంలో ఉద్యమంలోకి వెళ్లిన సత్యనారాయణ రెడ్డి మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు.30 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన కేంద్ర కమిటీ సభ్యులు గా బాధ్యతలు చేపట్టి విప్లవోద్యమం లో పోరాటాలు,చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు.గోపాలరావు పల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 Also Read: Bathukamma Record: గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లక్ష్యంగా బల్దియా ‘బతుకమ్మ’ వ్యూహం

రామచంద్రారెడ్డి . నేపద్యం!

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లికి చెందిన కామ్రేడ్ కాతా రామచంద్రారెడ్డి ఛత్తిస్ గడ్ అబూజ్మాడ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. తీగలకుంటపల్లిలో జన్మించిన రామచంద్రారెడ్డి కోహెడలో పదవ తరగతి, సిద్దిపేటలో డిగ్రీ వరకు చదివి వరంగల్ లో టీటీసీ పూర్తిచేసి, భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పెంచికలపేట ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా ఉద్యోగంలో చేరారు. అనంతరం బదిలీపై కోహెడ మండలం వరికోలు గ్రామంలో కూడా పనిచేశారు. ఆయనకు తల్లి, దండ్రులు వజ్రమ్మ, మల్లారెడ్డి,భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి 97 ఏళ్ల వయసులో తనపని తాను చేసుకుంటుండగా తల్లి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.

1988లో మాలతి అలియాస్ శాంతిప్రియని వివాహం

తమ్ముడు వెంకటరెడ్డి గ్రామంలో ఉంటూ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. 1988లో మాలతి అలియాస్ శాంతిప్రియని వివాహం చేసుకొన్న రామచంద్రారెడ్డి న్యాయవిద్యపై ఆసక్తితో నాందేడ్ వెళ్లారు.అక్కడ పీపుల్స్ వార్ గ్రూప్(పీడబ్ల్యూజీ)కు న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తూ అజ్ఞాతంలోకి వెళ్లారు. తొలుత తన భార్యతో కలిసి ఛత్తీస్ గఢ్ లోని రాయిపూర్ డెన్ కీపర్ గా పని చేశారు. తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగి, దండకారణ్యం ప్రత్యేక జోనల్ కమిటీ(డీకేఎస్ జడ్సీ) అధికార ప్రతినిధిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు.

భార్య శాంతి ప్రియను 2008 జనవరి 22న పోలీసులు అరెస్టు

2020లో డీకేఎస్ జడ్సి బాధ్యతలను చేపట్టారు. ఆయన భార్య శాంతి ప్రియను 2008 జనవరి 22న పోలీసులు అరెస్టుచేశారు. శిక్షపూర్తి చేసుకుని విడుదలయ్యారు. వారి కుమారుడు దంత వైద్యుడుగా,కుమార్తె సిఏ గా పనిచేస్తున్నారు. రామచంద్రారెడ్డి మృతదేహం కోసం ఆయన కుమారుడు, బంధువులు చత్తీస్ గడ్ బయలుదేరి వెళ్లారు. తీగల కుంట పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని అతనితో ఉన్న స్నేహితులు ప్రసారమాధ్యమాల తెలుసుకొని అతనితో స్నేహితులుగా ఉన్నవారు వారితో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు.. తీగలకుంట్ల పల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 Also Read: Kolkata Rainfall: గత 22 రోజుల వర్షపాతం 6 గంటల్లోనే.. కోల్‌కతా కకావికలం.. 9 మంది మృతి.. 30 విమానాలు రద్దు

Just In

01

OG advance booking: ఆ రికార్డుపై కన్నేసిన పవన్ కళ్యాణ్.. ఈ సారి మనదే అంటున్న ఫ్యాన్స్

Mahabubabad Rally: ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలి.. ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగులు

Ponnam Prabhakar: జీఎస్టీ టాక్స్ తో ఏం మంచి పని జరిగింది?.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

OG release: ఉత్తరాంధ్రలో ‘ఓజీ’ బ్యాంగ్ మోగించేందుకు సర్వం సిద్ధం..

Land Encroachment: భూ కబ్జాలపై సర్కార్ షాక్?.. హైడ్రా ఆపరేషన్ తర్వాత విస్తుపోయే విషయాలు వెలుగులోకి?