Bathukamma Record: రికార్డు లక్ష్యంగా బల్దియా బతుకమ్మ వ్యూహం
Bathukamma-Record
Telangana News, లేటెస్ట్ న్యూస్

Bathukamma Record: గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లక్ష్యంగా బల్దియా ‘బతుకమ్మ’ వ్యూహం

Bathukamma Record: బతుకమ్మ జనసమీకరణకు కసరత్తు

మహిళా సంఘాల సభ్యులకు బల్దియా స్పెషల్ బ్యాడ్జి?
మొత్తం 60 నుంచి 80 బస్సుల్లో తరలించేలా ఏర్పాట్లు
బుధవారం రూట్ మ్యాప్ ఖరారయ్యే అవకాశం
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బస్సుల్లోనే ట్యాగ్‌లు
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లక్ష్యంగా బల్దియా వ్యూహాం

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో (Bathukamma Record) స్థానం దక్కేలా వివిధ విభాగాల అధికారులు వ్యూహం సిద్దం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక, పర్యాటక శాఖ బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు టార్గెట్‌గా ఈ నె 28న నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు సమారు 8 వేల మంది స్వయం సహాయక బృందాల సభ్యులను సమీకరించే బాధ్యతను సర్కారు జీహెచ్ఎంసీకి అప్పగించింది. దీంతో, అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సిటీలోని 30 సర్కిళ్లలోని స్వయం సహాయక బృందాలను ఎల్బీ స్టేడియం తరలించేందుకు 60 నుంచి 80 బస్సులను సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తం పది వేల మంది మహిళలతో ఈ బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాలని భావిస్తుండగా, ఇందులో 8 వేల మందిని జీహెచ్ఎంసీ, మరో రెండు వేల మందిని సెర్ప్ సమీకరించనున్నట్లు తెలిసింది.

ఈ సారి 28న ఆయా ప్రాంతాల నుంచి వచ్చే స్వయం సహాయక బృందాలకు చెందిన సభ్యులకు ఆర్టీసి బస్సులోనే ట్యాగ్‌లు వేసి స్టేడియానికి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. స్టేడియం ఎంట్రెన్స్ వద్ద పది వేల మంది కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ప్రాథమికంగా 60 నుంచి 80 బస్సుల్లో మహిళలను తరలించాలని నిర్ణయించుకున్న జీహెచ్ఎంసీచ ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను బుధవారం (సెప్టెంబర్ 23) సిద్దం చేయనున్నట్లు తెలిసింది. ఒక్కో సర్కిల్‌లో ఎంత మంది సభ్యులు యాక్టీవ్‌గా ఉన్నారు? వారిని తరలించే రూట్‌ను కూడా బుధవారమే ఖరారు చేయనున్నట్లు సమాచారం. సామూహిక బతుకమ్మ ఉత్సవాల్లో జీహెచ్ఎంసీకి చెందిన స్వయం సహాయక బృందాలకు చెందిన 8 వేల మది మహిళలకు ప్రత్యేకంగా బతుకమ్మ లోగోతో తయారు చేసిన బ్యాడ్జిలను సమకూర్చాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు తెలిసింది.

Read Also- Haris Rauf controversy: భారత ఫైటర్ జట్లు కూల్చినట్టుగా బౌలర్ రౌఫ్ ఇచ్చిన సంకేతంపై పాక్ రక్షణ మంత్రి స్పందన

బతుకమ్మకు వాన భయం

ఈ నెల 30వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ లో చిరుజల్లులు మొదలుకుని ఓ మోస్తారు వర్షం కురిసే అవకాముందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గిన్నీస్ రికార్డే లక్ష్యంగా ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సామూహిక బతుకమ్మ ఉత్సవానికి వాన భయం పట్టుకుంది. వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చినప్పటికీ, ఈ సారి ఎలాగైనా గిన్నీస్ రికార్డును కైవసం చేసుకునే దిశగా ఏర్పాట్లు చేసుకుని సిద్దంగా ఉండాలని వివిధ విభాగాలు భావిస్తున్నట్లు సమాచారం. వర్షం పడకపోతే ఎట్టి పరిస్థితుల్లో మన బతుకమ్మ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకోవటం ఖాయమని పలు శాఖల అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Also- UPI Miracle: భార్య ఫోన్ పోయిందనుకున్న వ్యక్తికి ‘యూపీఐ మిరాకిల్’

26న బతుకమ్మ కుంటకు పెద్ద సంఖ్యలో మహిళలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బతుకమ్మ వేడుకలకు చారిత్రక ల్యాండ్ మార్కుగా పేరుగాంచిన అంబర్ పేటలోని బతుకమ్మ కుంటను హైడ్రా పునరుద్దరించగా, ఈ నెల 26న గ్రాండ్ ఓపెనింగ్ చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తుంది. తొలుత 23వ తేదీ, ఆ తర్వాత 25వ తేదీన ఈ గ్రాండ్ ఓపెనింగ్‌ను నిర్వహించాలని భావించినా, చివరకు 26వ తేదీ సాయంత్రం ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కంటను ప్రారంభించనున్నందున, ఆ రోజు జీహెచ్ఎంసీ స్వయం సహాయక బృందాలకు చెందిన సుమారు రెండున్నర వేల మందిని అక్కడకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Just In

01

Ranga Reddy District: దేవాదాయ భూమిపై రియల్ కన్ను.. చక్రం తిప్పిన పాత ఆర్డీవో!

Xiaomi Launch: అల్ట్రా ఫీచర్లతో Xiaomi 17 Ultra లాంచ్

Phone Tapping Case: ట్యాపింగ్ వెనుక రాజకీయ ఆదేశాలేనా? కేసీఆర్, హరీశ్ రావుల విచారణపై చర్చ!

Gram Panchayat: గ్రామ పంచాయతీలకు నిధులొస్తాయా?.. సర్పంచుల్లో టెన్షన్!

Ugandhar Muni: ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా.. ‘శంబాల’ కథ రాశా!