Bommala koluvu (( IMAGE credit: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Bommala koluvu: దసరా పండుగ ప్రత్యేకం.. పల్లెల్లో బొమ్మల కొలువు సాంప్రదాయాలకు నెలవు

Bommala koluvu: దసరా పండుగ వచ్చింది… సరదాలు ఎన్నో తెచ్చింది. అంటూ పల్లెల్లో పాటలు పాడుకుంటూ ఆనందోత్సవాల మధ్య దసరా “బొమ్మల కొలువు (Bommala koluvu) ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట కొలువు తీరుతుంది. దసరా నవరాత్రులలో పది రోజులపాటు బతుకమ్మ ఆటపాటలకు తోడు బొమ్మలకు పండగ జరుపుకుంటారు. ప్రతిరోజు సాయంత్రం పేరంటానికి ముత్తైదువులను, చిన్నపిల్లలను పిలిచి అందరికీ తాంబూలం, దక్షిణ ఇవ్వడంతో అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

దాంతోపాటు అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందనేది ప్రజల్లో నానుడి. ఇలా ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా గ్రామ గ్రామాల్లో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా కురత్తాశ్వర్ వంశానికి చెందిన వేదభ్యాస భట్టార్లు తమ ఇండ్లలో ఏర్పాటు చేసిన శ్రీవారి బొమ్మల కొలువు నిర్వహిస్తూ తమ ఆచారాన్ని చాటుకుంటున్నారు. తమిళ సంస్కృతిలో భాగంగా దసరా నవరాత్రుల్లో బొమ్మలను అమర్చి చేసే సాంప్రదాయ అలంకరణ బొమ్మల కొలువుగా పిలుచుకుంటారు.

 Also Read: Telangana: ప్రభాకర్ రావు సహకరించటం లేదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు

బొమ్మల కొలువు అంటే

ఇది దసరా పండుగ సందర్భంగా ఇళ్లలో దేవుని విగ్రహాలతో పాటు వివిధ రకాల బొమ్మలను అలంకరించే ఒక సాంప్రదాయ పద్ధతి. పిల్లల ఆనందోత్సాహాలం కోసం దీనిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. తెలుగు టి సంబరాల సమాహారం దసరా. పండుగ అంటే దేవీ నవరాత్రులు.. అమ్మవారి అలంకరణలు మాత్రమే కాదు. చూడ చక్కని బొమ్మలు. ఆ సందర్భంగా జరిగే పేరంటాలు కూడా ఇందులో భాగమే. దసరా నవరాత్రుల్లో చల్లని సాయంత్రాన బొమ్మల కొలువులకు వెళ్లడం మహిళలకు ప్రత్యేక అనుభూతి. బొమ్మల కొలువు అంటే చిన్న, పెద్ద అందరికీ పండుగే. రంగురంగుల బొమ్మలను చూడటం పిల్లలకు ఎనలేని ఆనందాన్ని ఇస్తే వాటిని ఓ క్రమ పద్ధతిలో అందంగా అమరచడం పెద్దవాళ్లకు అంతులేని ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే ఈ వేడుకలో ఇంటిల్లిపాది భాగస్వాములు అవుతారు. కొత్తగా వచ్చిన అపార్ట్మెంట్ కల్చర్ లోను ఇవి సామాజిక వేడుకల్లా మారాయి.

పండుగను వంశఫారంపర్యంగా కొనసాగిస్తూ వస్తున్నాం.. బల్లవరం గాయత్రి, కృష్ణమాచార్యులు

బొమ్మల కొలువు పండుగను వంశపారంపర్యంగా కొనసాగిస్తూ వస్తున్నాం. తమిళనాడులో ఇది ఒక ముఖ్యమైన పండుగ. మహిషాసురుడిని జయించిన రోజును గుర్తుగా ఈ బొమ్మల కొలు పండుగను నిర్వహించుకుంటాం. ఈ పండుగలో భాగంగా కొత్త తరానికి పురాణాలు, సంస్కృతిని పరిచయం చేయడమే కాక పిల్లలను ఆనందింప చేయడమే ప్రధాన లక్ష్యం.

 Also Read: Medak District: మెదక్ జిల్లాలో ఘోర సంఘటన.. ఏడాదిన్నర దూడపై యువకుడి అఘాయిత్యం

Just In

01

Digital Arrest: పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉందంటూ వృద్ధుడి డిజిటల్ అరెస్ట్

Telusu Kada second song: సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ నుంచి సెకండ్ మెలొడీ.. అదిరింది మావా..

Harish Rao: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం.. హరీష్ రావు ఫైర్

Bathukamma Record: గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లక్ష్యంగా బల్దియా ‘బతుకమ్మ’ వ్యూహం

Swetcha Effect: ఆర్థిక భారం అలసత్వం స్వేచ్ఛ కథనంతో.. హెచ్ సిటీ పనులకు రంగంలో దిగిన కమిషనర్