Viral Video (Image Source: Twitter)
Viral

Viral Video: నషా ఎక్కిన యువ జంట.. పోలీసు జీపుపైనే రొమాన్స్.. ఎంతకు తెగించార్రా!

Viral Video: రాజస్థాన్‌లోని కోటా నగరంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ యువ జంట ఏకంగా పోలీసు జీపు మీదకు ఎక్కి అభ్యంతరకరంగా ప్రవర్తించింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు ఆమెను అసభ్యంగా తాకుతూ మద్యం మత్తులో రెచ్చిపోయాడు. సెప్టెంబర్ 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసుల ముందే యువత రొమాన్స్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అసలేం జరిగిందంటే?
రాజస్థాన్ లోని రాంపురా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం (సెప్టెంబర్ 18) రాత్రి రోడ్డుపై ఓ జంటను పోలీసులు చూశారు. వారు పోలీసులను చూసి పరిగెత్తడంతో అనుమానించి.. వెంటపడ్డారు. ఆపై అదుపులోకి తీసుకొని వారిని పోలీసు జీపులో కుర్చోబెట్టారు. అయితే ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న 22 ఏళ్ల యువకుడు.. జీపులో నుంచి దిగి.. వాహనంపైకి ఎక్కాడు. పెద్దగా కేకలు వేస్తూ చిందులు వేయడం ప్రారంభించాడు.

అసభ్యకరంగా తాకుతూ..
అయితే యువకుడికి నచ్చజెప్పి కిందకు తీసుకువస్తానని చెప్పి.. యువతి కూడా పోలీసు జీపుపైకి ఎక్కింది. యువతి జీపు ఎక్కగానే ఆ యువకుడు మరింత రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండా.. ఆ యువతిని అసభ్యకరంగా తాకడం ప్రారంభించాడు. మరోవైపు ఆ యువతి.. ‘నేనే అతన్ని కిందికి దింపుతాను’ అని చెప్పడం వీడియో కనిపించింది. అదే సమయంలో ‘మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు’ అని ఆమె పోలీసులను వేడుకుంది.

యువకుడిపై కేసు..
జనాలు పెద్ద ఎత్తున పోగు అవుతుండటంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. యువ జంటను బలవంతంగా జీపు మీద నుంచి కిందకి దించి వాహనంలోకి ఎక్కించారు. యువతి వయసు 17 ఏళ్లు మాత్రమేనని.. ఆమె మైనర్ అని పోలీసులు తెలిపారు. యువకుడితో పాటు ఆమె కూడా మద్యం సేవించి ఉన్నట్లు చెప్పారు. పోలీస్ వాహనం పైకి ఎక్కి గందరగోళం సృష్టించిన కారణంగా యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Also Read: Afghan Boy: విమానానికి వేలాడుతూ.. భారత్‌కు వచ్చిన అఫ్గాన్ బాలుడు.. వీడు మామూలోడు కాదు!

ఇటీవల భోపాల్‌లో కూడా..
కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలోనూ ఇలాంటి షాకింగ్ ఘటనే చోటుచేసుంది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు.. వీఐపీ రోడ్డులోని రాజా భోజ్ విగ్రహం వద్ద హంగామా సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. కొందరు యువకులు బైకులపై అక్కడకు చేరుకున్నారు. మద్యం మత్తులో ఉండి అటుగా వెళ్లే వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురి చేశారు.

Also Read: Tollywood: సౌందర్య చివరి చూపుకి కూడా వెళ్లలేకపోయా.. ఇంట్లో వాళ్లే ఆపారంటూ కన్నీరు పెట్టుకున్న హీరోయిన్

Just In

01

Thalaivar 173 music: రజనీకాంత్ ‘తలైవార్ 173’ సంగీత దర్శకుడు అతడేనా.. అయితే ఫ్యాన్స్‌కు పండగే..

Andesri Passed Away: అస్తమించిన అందెశ్రీ.. ప్రముఖుల సంతాపం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

Free Gemini Pro Offer: భారీ గుడ్ న్యూస్.. జియో కస్టమర్లకు గూగుల్ జెమినీ ప్రో ఫ్రీ యాక్సెస్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి

Andesri death: ప్రజాకవి అందేశ్రీ మృతిపై స్పందించిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి

Telangana BJP: పోల్ మేనేజ్‌మెంట్‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్.. వర్కౌట్ అయ్యేనా..!