Tollywood: సౌందర్య మరణం తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికీ అందరినీ కలచివేసే సంఘటన. ఆమెతో కలిసి పనిచేసినవారు, సన్నిహితంగా ఉన్నవారు ఆమెను తలచుకుంటూ ఇప్పటికీ ఎంతో మంది ఆమెను గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే నటి రాశి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి తలచుకుని ఎమోషనల్ అయింది.
Also Read: Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు
రాశి, సౌందర్యతో కలిసి ‘పోస్ట్‌మెన్’, ‘మూడు ముక్కలాట’ వంటి చిత్రాల్లో నటించారు. “సౌందర్య నాకంటే ముందే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె సెట్ లో ఉన్నప్పుడు, ఆమెతో పని చేసే వాళ్లు ‘మా మేడమ్‌ను టాలీవుడ్‌లో ఎవరూ అందుకోలేరు’ అని గర్వంగా చెప్పుకునేవారు. కానీ, నేను వచ్చిన తర్వాత ‘ ఇప్పుడు మీ మేడమ్ వచ్చారు కదా’ అని అనేవారు ” అని రాశి గుర్తుచేసుకున్నారు.
మేమిద్దరం ఒకే సినిమాలో నటించే సమయంలో నాకు, ఆమెకు ఎదురెదురు రూమ్స్ ఇచ్చారు. “సౌందర్య నన్ను తన ‘చెల్లి’ గా చూసుకునేది. పిలవడం కూడా ప్రేమగా పిలిచేది. ఆమె ఆప్యాయత, మాటల్లోని సౌమ్యత మర్చిపోలేనివి,” అని రాశి భావోద్వేగంతో చెప్పారు. అయితే, రాశి జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం గురించి చెబుతూ, “నా పెళ్లి రోజు తెల్లవారుజామున సౌందర్య మరణవార్త విన్నాను. ఆ వార్త చాలా చాలా బాధ పడ్డా. నా పెళ్లికి ఇండస్ట్రీ నుండి ఒక్కరిని పిలవాలంటే అది సౌందర్యనే అనుకున్నాను. కానీ ఆమె లేరని తెలిసి కన్నీళ్లు ఆగలేదు.
Also Read: Swetcha Effect: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు..స్వేచ్ఛ కథనంపై స్పందించిన రెవెన్యూ అధికారులు
పెళ్లి కూతురుగా చేసిన తర్వాత ఆమెను చివరిసారి చూసే అవకాశం కూడా నాకు రాలేదు.. అని ఆవేదన వ్యక్తం చేశారు. సౌందర్య మరణం తర్వాత ఇండస్ట్రీ వాళ్లు ఏర్పాటు చేసిన సంతాప సభకు కూడా రాశి వెళ్లలేకపోయారు. “మా ఇంట్లో వాళ్లే నన్ను ఆపారు.. ‘పెళ్లి కూతురు బయటకు వెళ్లొద్దు’ అని చెప్పారు. కానీ, సౌందర్యను చివరిసారి చూడలేకపోయిన బాధతో ఆ సంతాప సభకైనా వెళ్లాలని బెంగళూరు వెళ్లాను” అని రాశి కన్నీటితో గుర్తుచేసుకున్నారు. సౌందర్య జ్ఞాపకాలు రాశిని ఇప్పటికీ కంటతడి పెట్టిస్తున్నాయంటే.. , ఆమె ప్రేమ, ఆప్యాయత ఆమె హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.