KTR( IMAGE credit: swetcha reporter or twitter)
Politics, లేటెస్ట్ న్యూస్

KTR: స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించండి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు తమ డిమాండ్లను సాధించుకోవడానికి ఐకమత్యం ప్రదర్శించాలని, గ్రామ గ్రామానా తీర్మానాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని, అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక దిగివస్తాయని, సమస్య వారి దృష్టికి వెళ్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ భవన్ లో  రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) (Regional Ring Road) అలైన్‌మెంట్ తో నష్టపోయిన నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బాధితులు కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్నలకు పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

  Also Read: Mahabubabad District: ప్రభుత్వ అధికారుల బహిరంగ వాగ్వాదం.. బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత

కాంగ్రెస్ స్వార్థపూరిత నిర్ణయాలు రైతుల జీవితాలను నాశనం

రైతుల పోరాటానికి బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ స్వార్థపూరిత నిర్ణయాలు రైతుల జీవితాలను నాశనం చేయకుండా చివరి వరకు మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు రీజినల్ రింగ్ రోడ్డుతో ఎవరికీ ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీల మీదనే రైతులు కాంగ్రెస్‌కు ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చారని, అయితే అధికారంలోకి వచ్చాక అలైన్‌మెంట్ మార్చి రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక కాంగ్రెస్ నేతలు గెలిచిన తర్వాత రైతులను పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో వ్యవసాయం, ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని సుభిక్షం చేశామని తెలిపారు.

పేదల, రైతుల జీవితాలను ఆగం చేస్తోంది

గతంలో భూసేకరణ సమస్యలు ఎదురైనప్పుడు తమ ప్రభుత్వం నేరుగా రైతులతో చర్చలు జరిపి, వారికి పునరావాసం కల్పించి, శాశ్వత పరిష్కారాలు చూపించిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం అవుటర్ రింగ్ రోడ్డు విషయంలోనూ, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ విషయంలోనూ అలైన్‌మెంట్లు మార్చి పేదల, రైతుల జీవితాలను ఆగం చేస్తోందని ఆరోపించారు. ఆర్‌ఆర్‌ఆర్ బాధితుల అంశాన్ని పార్లమెంట్, రాజ్యసభలలో బీఆర్‌ఎస్ ఎంపీలు లేవనెత్తుతారని ప్రకటించారు.

రైతన్నలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాలి

అసెంబ్లీలోనూ ఈ అంశాన్ని తీవ్రంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. రైతన్నలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. శాస్త్రీయబద్ధమైన అలైన్‌మెంట్ జరిగేదాకా బీఆర్‌ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అబద్ధాలను నమ్మి ఓటేసిన ప్రజలకు ఇప్పుడు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, పల్లెరవికుమార్, బొల్లం మల్లయ్యయాదవ్,తుంగబాలు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Kishan Reddy: డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా దేశాన్ని చూడటమే లక్ష్యం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Just In

01

Sai Pallavi: బికినీలో నేచురల్ బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్!

Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?

OG Benefit Show: మొత్తానికి సాధించారు.. ఏపీలో బెనిఫిట్ షో టైమింగ్ మారింది!