Kantara Chapter 1 Trailer: హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1). రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రం ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో, ఫస్ట్ పార్ట్‌ని మించి అంచనాలను ఏర్పరచుకుంది. ఇటీవల మేకర్స్ ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లుగా తెలుపుతూ విడుదల చేసిన ‘కాంతార చాప్టర్ 1’ మేకింగ్ వీడియో.. సినిమాపై ఉన్న అంచనాలను డబుల్ చేసిందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం (సెప్టెంబర్ 22), రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) డిజిటల్‌గా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతూ.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Kantara Chapter 1 Trailer Review)
Also Read- OG Trailer: ‘ఓజీ’ ట్రైలర్.. బొంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త! గూస్‌బంప్స్ పక్కా!
ఈ ట్రైలర్‌ను గమనిస్తే..
ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు.. ‘కాంతార’ తరహాలోనే మరో గొప్ప కథ చెప్పబోతున్న ఫీల్‌ని ఇచ్చేశారు. పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ కథ.. సంప్రదాయం, జానపద కథల సమ్మేళనంతో సాగుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఈ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా దట్టమైన అడవుల్లో వచ్చే సీన్స్, పులితో పోరాడే సన్నివేశాలు గూస్‌బంప్స్ అని చెప్పొచ్చు. కథని మొదలు పెట్టిన తీరు కూడా ‘కాంతార’కు కనెక్షన్ ఉండేలా చెప్పడం కనెక్టింగ్‌గా ఉంది. ‘ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో.. ధర్మాన్ని కాపాడ్డానికి ఆ ఈశ్వరుడు తన గణాలని పంపుతూనే ఉంటాడు. ఆ అన్ని గణాలు వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలో’ అనే డైలాగ్.. ఇందులో రిషబ్ శెట్టి రాసుకున్న కథ, కథనాలు ఏంటనేది తెలియజేస్తుంది.. రాజుల కాలానికి ముడిపెట్టి, ఆ ఇంటి అమ్మాయిని ప్రేమించడం, సింహాసనం కూడా లాక్కెళ్లిపోతాడనేలా చెప్పించడం చూస్తుంటే.. ఇందులోనూ రివెంజ్ డ్రామా ఉంటుందనేది అర్థమవుతోంది. అలాగే వావ్ మూమెంట్స్‌కు లోటు ఉండదు అనేలా ట్రైలర్ క్లారిటీ ఇస్తోంది.
Also Read- Mirai Telugu Movie: వారు లేకపోతే సినిమా లేదన్న ‘మిరాయ్’ దర్శకుడు.. ఎవరంటే?
మొదటి పార్ట్‌ను మించేలా
మరోవైపు రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్‌ల ప్రేమ కథ, ఇద్దరూ వారి పాత్రలలో ఒదిగిపోయిన తీరు.. మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ సినిమా కథాంశానికి తగిన ఆధ్యాత్మికత ప్రదర్శించారు. శివుడు, పంజుర్లికి సంబంధించిన లోతైన కనెక్షన్లను సూచించడం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించి, సినిమా ఎలా ఉంటుందో చూడాలనే ఆత్రుతను పెంచుతోంది. అలాగే పల్లెటూరి సంస్కృతిని చాలా అందంగా ఈ ట్రైలర్ ప్రతిబింబిస్తుంది. ఓవరాల్‌గా అయితే, మొదటి పార్ట్‌ను మించేలా ఈ సినిమా ఉండబోతుందనే క్లారిటీ అయితే ఈ ట్రైలర్ ఇచ్చేసింది. ఇక ఈ అక్టోబర్ 2న కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ వంటి పలు భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా, ఈసారి ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ మాత్రం మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ.. అప్పుడే రికార్డుల పరంపరను మొదలెట్టింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు