OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరీక్షణకు తెరపడింది. ‘ఓజీ’ ట్రైలర్ వచ్చేసింది. వాస్తవానికి ఈ ట్రైలర్.. ఆదివారం ఉదయమే విడుదల కావాల్సి ఉంది. డీఐ వర్క్‌తో పాటు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా డిలే అయింది. అయినా సరే, ఆదివారం సాయంత్రం జరిగిన ‘ఓజీ కన్సర్ట్’ (OG Concert)లో చిత్ర ట్రైలర్‌ను ఫ్యాన్స్ కోసం ప్లే చేయించారు పవన్ కళ్యాణ్. ఈ ట్రైలర్‌ని ఫోన్లలో చిత్రీకరించిన వారంతా.. సోషల్ మీడియాలో పెట్టేయడంతో వైరల్ అవుతూనే ఉంది. ఇక అధికారికంగా మేకర్స్ సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ అయితే వదిలారు కానీ, రికార్డులు క్రియేట్ చేసే మంచి ఛాన్స్‌ని మిస్సయ్యారనే చెప్పుకోవాలి. ఫ్యాన్స్ అందరూ.. ఈ ట్రైలర్ కోసం వేచి చూసి చూసి, చివరకు నిర్మాణ సంస్థపై ఫైర్ కూడా అయ్యారు. ఆదివారం ఉదయం మంచి టైమ్‌కి వదులుతున్నారు.. రికార్డులు బద్దలు కొట్టాలనే ధ్యేయంతో ఉన్న వారందరినీ మేకర్స్ డిజప్పాయింట్ చేశారు. వారి డిజప్పాయింట్‌ని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్, ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకలో.. ఎలా ఉన్నా పర్లేదు, మా వాళ్లు అర్థం చేసుకుంటారు.. ట్రైలర్ ప్లే చేయాల్సిందేనని పట్టుబట్టి మరీ ప్లే చేయించారు. దీంతో ఫ్యాన్స్ అందరూ కాస్త హ్యాపీగానే ఉన్నారు. ఇక తాజాగా వచ్చిన ట్రైలర్ విషయానికి వస్తే..
Also Read- Raasi: స్నానం చేస్తూ చేసే.. అలాంటి సీన్స్ నాకు సెట్ అవ్వవు.. సంచలన కామెంట్స్ చేసిన రాశి
‘బొంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త’
ఈ ట్రైలర్ (OG Trailer) విడుదలైన కాసేపటికే.. సోషల్ మీడియాలో అగ్రి తుఫాను సృష్టిస్తోంది. సినిమా స్థాయిని, శక్తివంతమైన కథని, గొప్ప విజువల్స్‌ను ప్రదర్శిస్తూ.. దర్శకుడు సుజీత్ తన పనితనాన్ని ప్రదర్శించారు. ఈ సినిమా కోసం అందరూ ఎందుకు వెయిట్ చేస్తున్నారో, ఆ వెయిటింగ్‌కు తగిన కారణాన్ని ఈ ట్రైలర్ చెప్పకనే చెప్పేసింది. దర్శకుడు సుజీత్ ఈ ట్రైలర్‌ను భారీ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామాతో పాటు స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో ఓ విందు భోజనంలా మలిచారు. ఈ ట్రైలర్ అభిమానుల ఉత్సాహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందనడంలో అతిశయోక్తి లేనే లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని ప్రజంట్ చేసిన తీరు, ఓజాస్ గంభీరగా మరెవరికి సాధ్యంకాని వింటేజ్ స్టైల్, ఆరాతో ఇంతకు ముందెన్నడూ చూడని అవతార్ చూపించి ఫ్యాన్స్‌కి ముందే పండగ వైబ్స్ ఇచ్చేశారు. ‘బొంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త’ అని ఈ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఒక్కటి చాలు.. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలియడానికి.
Also Read- Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..
డిప్యూటీ సీఎం కోసం డ్యూటీ ఎక్కేశాడు
ఈ ట్రైలర్ పవన్ కళ్యాణ్ పాత్ర వెనకున్న రహస్యాన్ని హైలైట్ చేయడమే కాకుండా, పవన్ కళ్యాణ్-ఇమ్రాన్ హష్మీ పాత్రల మధ్య జరిగే యుద్ధాన్ని కూడా తెలియజేస్తుంది. వెండితెరపై ఈ ఉత్కంఠభరితమైన ఘర్షణను ఎప్పుడెప్పుడు చూస్తామా?.. అనే ఉత్సుకతను కలిగిస్తూ సినిమా స్థాయిని ఈ ట్రైలర్ డబుల్ చేసింది. ఈ గర్జనకు మూలం పవన్ కళ్యాణ్. ఆయన నుంచి ఇలాంటి సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఇంతటి శక్తివంతమైన పాత్రలో చూసి చాలా కాలం అయిందని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వేరే స్థాయిలో ఉందని.. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారంటే.. రేపు థియేటర్లలో సునామీ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. సంగీత దర్శకుడు థమన్ మరోసారి డిప్యూటీ సీఎం కోసం డ్యూటీ ఎక్కేశాడని అంతా అనుకుంటున్నారంటే.. ఎంతగా ఆయన ప్రాణం పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా 25 సెప్టెంబర్, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు