Urea Shortage ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Urea Shortage: రైతులను వీడని యూరియా కష్టాలు.. ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో ఆందోళన

Urea Shortage: భద్రాద్రి కొత్తగూడెంజిల్లా బూర్గంపాడు ప్రాథమిక వ్యవసాయ సహార సంఘం రైతు సేవ కేంద్రం నందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. యూరియా సరఫరలో (Urea Shorta) అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో రైతులకు యూరియా కరువైందని అధికారులు యూరియా ని అందించడంలో విఫలం చెందడంతో రైతులు రైతు సేవ కేంద్రం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరతను సృష్టించి రైతుల వెన్నును విరుస్తున్నారని రైతులు వాపోతున్నారు.

 Also  Read: MLC Kavitha: తెలంగాణ సాధించిన చంద్రునికి కొందరు మచ్చ తెచ్చారు: ఎమ్మెల్సీ కవిత

యూరియా కొరత కారణంగా రైతుకు చాలా నష్టం

వర్షాకాల పంట రబీ మొదలై మూడు నెలల వ్యవధి అయినప్పటికీ రైతుకు సరిపడా యూరియాను అందించడంలో ప్రభుత్వం ఇటు అధికారులు జాప్యం చేయడం తగదని పంటకాలం చివరి దశకు వస్తున్నందున రైతు గోసను అర్థం చేసుకొని యూరియాని అందించవలసిందిగా రైతులు వేడుకుంటున్నారు. యూరియా కొరత కారణంగా రైతుకు చాలా నష్టం వాటిల్లుతుందని, రైతుకు నేస్తం యూరియా అటువంటి యూరియాను రైతులకు దూరం చేసి రైతు ఆకలి కేకలు పెట్టేలాగా వ్యవహరించడం సరికాదని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు అండగా నిలవలసిన వారే మౌనం పాటించటం రైతును దిగజార్చేడమే అంటున్నా రైతులు. రైతు ఏడ్చిన రాష్ట్రం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదని రైతులు వ్యాఖ్యానించారు.

 Also Read: Kishan Reddy: డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా దేశాన్ని చూడటమే లక్ష్యం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వయోవృద్ధుల మల్టీ డే కేర్ సెంటర్ కొరకు దరఖాస్తులు

మహబూబాబాద్ జిల్లాలో వయోవృద్ధుల మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ నడుపుటకు స్వచ్ఛంద సంస్థలు, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవ్రుద్దుల సంక్షేమ శాఖ అధికారి కే. శిరీష సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మల్టీ సర్వీసు డే కేర్ సెంటర్ నిర్వహించేందుకు తెలంగాణ సొసైటీ రిజిస్ట్రేషన్ 2001, కంపెనీస్ యాక్టు 1956, ఇండియన్ ట్రస్ట్ యాక్టు 1882 ద్వారా రిజిస్ట్రర్ అయి ఉండాలన్నారు.

ఇతర వివరాల కోసం ఈ  ఫోన్ నెంబర్ సంప్రదించాలి

ఎన్జీవో, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ లేదా చిల్డ్రన్స్ హోమ్, షెల్టర్ హోమ్స్ నిర్వహించడంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలన్నారు. ఎన్జీవో, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ బ్లాక్ లిస్టులో ఉండటం పైనాన్సియల్ ఫ్రాడ్ కేసుల్లో ఉండటం వంటి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసుకొనుటకు దరఖాస్తులను ఐ డి ఓ సి లోని జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయం, మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని రూమ్ నెంబర్ 12 లో 25.09.2025 లోపు అందించాల్సిందిగా పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం ఫోన్ నెంబర్ 9642174243, 8978698912 లను సంప్రదించాలని కోరారు.

 Also Read: Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

Just In

01

Swetcha Effect: సింగపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు..స్వేచ్ఛ కథనంపై స్పందించిన రెవెన్యూ అధికారులు

Cockpit Door: విమానం గాల్లో ఉండగా.. టాయిలెట్‌కి వెళ్లిబోయి కాక్‌పిట్ తలుపుతట్టాడు!

Vote-for-Note Case: ఓటుకు నోటు కేసు.. సుప్రీంలో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్

OG Censor Details: ‘ఓజీ’ సెన్సార్ పూర్తి.. తొలగించిన సన్నివేశాలివే..

Adultery: వివాహేతర సంబంధాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు