brs mlc kavitha cbi judicial custody extended to june 21st | MLC Kavitha: కవిత కస్టడీ పొడిగింపు
MLC Kavita backlash in liquor scam
క్రైమ్

MLC Kavitha: కవిత కస్టడీ పొడిగింపు

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ నెల 21వ తేదీ వరకు ఆమె కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ శుక్రవారం ముగియడంతో సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సప్లిమెంటరీ చార్జిషీటును దాఖలు చేశారు. ఈ చార్జిషీట్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని కోరారు.

దీంతో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని జూన్ 21వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. అదే తేదీకి తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటును పరిగణనలోకి తీసుకోవాలా? లేదా? అనే అంశంపైనా అదే రోజు విచారణ జరగనుంది.

కాగా, కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. తాను చదువుకోవడానికి కొత్తగా 9 పుస్తకాలు కావాలని కోర్టును కోరారు. కవిత అభ్యర్థనకు రౌస్ అవెన్యూ కోర్టు అంగీకారం తెలిపింది.

Just In

01

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..