Bank Jobs 2025 Image Source (AI)
Viral

IBPS: గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

IBPS: బ్యాంకింగ్ రంగంలో కెరీర్ సెట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నవారికి శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) గ్రామీణ బ్యాంకుల్లో (RRB) 13,217 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21, 2025తో ముగిసింది, కానీ తాజాగా ఈ డేట్ ను సెప్టెంబర్ 28 వరకు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఇంకా అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

విద్యార్హతలు

ఆఫీస్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన విద్యార్హత.
ఆఫీసర్ స్కేల్-I: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన విద్య.
ఆఫీసర్ స్కేల్-II (జనరల్): ఏదైనా విభాగంలో 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ.
ఆఫీసర్ స్కేల్-II (స్పెషలిస్ట్):ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో 50% మార్కులతో డిగ్రీ.
లా ఆఫీసర్: లా విద్యలో 50% మార్కులతో డిగ్రీ.
చార్టెడ్ అకౌంటెంట్/ఫైనాన్స్ మేనేజర్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేషన్ లేదా ఫైనాన్స్‌లో MBA.
మార్కెటింగ్ ఆఫీసర్: మార్కెటింగ్‌లో MBA.
అగ్రికల్చర్ ఆఫీసర్: అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లేదా పిసికల్చర్‌లో 50% మార్కులతో డిగ్రీ.

ఆఫీసర్ స్కేల్-III: ఏదైనా విభాగంలో 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ.

వయోపరిమితి

ఆఫీస్ అసిస్టెంట్: 18-28 సంవత్సరాలు.
ఆఫీసర్ స్కేల్-I: 18-30 సంవత్సరాలు.
ఆఫీసర్ స్కేల్-II: 21-32 సంవత్సరాలు.
ఆఫీసర్ స్కేల్-III: 21-40 సంవత్సరాలు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

ఆఫీస్ అసిస్టెంట్: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు.
ఆఫీసర్ స్కేల్-I: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ.
ఆఫీసర్ స్కేల్-II & III: సింగిల్ లెవల్ పరీక్ష, ఇంటర్వ్యూ.

ఈ గోల్డెన్ ఛాన్స్‌ను అస్సలు మిస్ చేసుకోకండి.. వెంటనే, https://www.ibps.in/ లో వివరాలు చెక్ చేసి, మీ బ్యాంకింగ్  జాబ్ కల నెరవేర్చుకోండి.

Just In

01

Bathukamma Festival: శ్రీ చైతన్య పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. స్త్రీల సాంప్రదాయానికి ప్రతీక

Gun Celebration: ‘గన్ సెలబ్రెషన్‌’ అందుకే చేశాను.. స్పందించిన పాకిస్థాన్ క్రికెటర్ ఫర్హాన్

Kishan Reddy: డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా దేశాన్ని చూడటమే లక్ష్యం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

OG Trailer: ‘ఓజీ’ ట్రైలర్.. బొంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త! గూస్‌బంప్స్ పక్కా!

Satyavathi Rathod: తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు