Huzurabad District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Huzurabad District: హుజురాబాద్ మండలంలోని సింగాపూర్(Singaapur) గ్రామంలో అదివారం అక్రమ మొరం తవ్వకాలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క పర్మిషన్ లేని తవ్వకాలు, మరోపక్క అధికారుల పర్యవేక్షణ లోపంతో గ్రామంలోని విలువైన సహజ సంపద దోచుకుపోతోందని ఆరోపిస్తున్నారు. గ్రామంలో నిర్ బోటి గుట్ట కు గ్రానైట్ క్వారీకి అనుమతులు తీసుకున్నప్పటికీ, నాణ్యత పరీక్షల్లో విఫలమవడంతో ఆ క్వారీని మూసివేశారు. అయితే, ఆ క్వారీకి జార్ఖండ్ చెందిన మనోజ్ అనే వ్యక్తిని కాపలాదారుగా నియమించారు. ఈ మనోజ్(Manoj) కొందరు స్థానిక నాయకులతో కలిసి, క్వారీ సంబంధించిన హిటాచి (భారీ యంత్రం)పెద్ద పొక్కిలిన్ తో తీస్తూ ట్రాక్టర్ల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Also Read: Tollywood Hero: పుట్టినరోజున ఈ హీరో ఏం చేశాడో చూశారా?

పర్మిషన్ గ్రానైట్‌కి, తవ్వకాలు మొరంకి..

క్వారీ యజమానికి కేవలం గ్రానైట్ తవ్వకాలకు మాత్రమే అనుమతి ఉందని, మొరం తవ్వకాలకు ఎలాంటి పర్మిషన్ లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. కానీ, ఈ అక్రమ తవ్వకాల హిటాచి పెద్ద పొక్కిలిన్ తో మొరం తీసి ట్రాక్టర్ల ద్వారా బయటి వ్యక్తులకు,వివిధ వెంచర్లకు అమ్ముకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ప్రమాదంలో గ్రామ భవిష్యత్తు..

ఎటువంటి రెవెన్యూ(Revenue), మైనింగ్(Mining) అధికారుల పర్యవేక్షణ లేకుండా ఈ అక్రమ దందా కొనసాగుతోందని, ఇది ఇలాగే కొనసాగితే గ్రామానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి, అక్రమ తవ్వకాలను ఆపాలని, ఈ దందా వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే, భవిష్యత్తులో ఈ అక్రమ కార్యకలాపాలు మరింత పెరిగి, గ్రామానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Chiranjeevi : ప్రియమైన మిత్రుడికి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకంటే?

Just In

01

Mahabubabad District: బతుకమ్మ ఆడుతూ.. గుండెపోటుతో హిళ మృతి.. ఎక్కడంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమొదు

Pawan Kalyan: తెలంగాణలో ఈవెంట్ పెట్టి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు.. పవన్ ని ఏకిపారేస్తున్న నెటిజన్స్

Mahabubabad District: ప్రభుత్వ అధికారుల బహిరంగ వాగ్వాదం.. బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత

MLC Kavitha: తెలంగాణ సాధించిన చంద్రునికి కొందరు మచ్చ తెచ్చారు: ఎమ్మెల్సీ కవిత