Kantara 2: కన్నడ సినీ పరిశ్రమ నుండి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమా విజయపరంపరను కొనసాగిస్తూ, దాని ప్రీక్వెల్ అయిన ‘కాంతార: చాప్టర్ 1’ ఇప్పుడు సినీ ప్రియుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. అత్యంత భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి కీలకమైన అప్డేట్‌ని మేకర్స్ తెలియజేశారు. అక్టోబర్ 2న ఈ సినిమా దసరా స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడులయ్యేందుకు సిద్దమవుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీ, సమయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఈ ట్రైలర్‌ను ఎవరు విడుదల చేయబోతున్నారనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్..
ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాలలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. భారీగా బిజినెస్ కూడా జరిగింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఎంటర్‌టైన్ చేయడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్‌ను సెప్టెంబర్ 22, మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ప్రకటన సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. బాహుబలి వంటి భారీ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ చేతుల మీదుగా ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్ విడుదల కావడం సినిమాకు మరింత బజ్ తీసుకువస్తుందనడంలో అతిశయోక్తి లేనే లేదు. ఇది కంటెంట్ విషయంలో చిత్ర బృందం ఎంత నమ్మకంగా ఉందో స్పష్టం చేస్తుంది.
Also Read- Hema: ‘మా’ ప్రెసిడెంట్ సిస్టర్‌కే ఈ గతి పడితే.. మంచు లక్ష్మికి సపోర్ట్‌గా హేమ సంచలన వీడియో!
ఒక అద్భుతమైన విజయం
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించిన ‘కాంతార’ కన్నడ చిత్రసీమ నుండి వచ్చిన ఒక అద్భుతమైన విజయం. సంస్కృతి, నమ్మకాలు, ప్రకృతితో మనిషి సంబంధాన్ని ఒక అద్భుతమైన కథాంశంతో ఆవిష్కరించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను సాధించింది. ఇప్పుడు, ‘కాంతార: చాప్టర్ 1’ తో, రిషబ్ శెట్టి మొదటి సినిమాకు ముందు జరిగిన కథను చెప్పబోతున్నారు, ఇది ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేస్తుంది.
Also Read- Idli Kottu Trailer: వారసత్వాన్ని వదిలి వలసెళ్లిపోయాడు.. ఎక్కడికెళ్తాడు, ఎగిరెగిరి ఇక్కడికే రావాలి
ట్రైలర్ విడుదలైన తర్వాతే
ప్రభాస్ వంటి అగ్రశ్రేణి నటుడు ఈ ట్రైలర్‌ను విడుదల చేయడం ద్వారా, ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించనుంది. సెప్టెంబర్ 22న ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా కథాంశం, గ్రాండియర్, రిషబ్ శెట్టి విజన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడవుతాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం కూడా మొదటి భాగం వలెనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు