Pawan Kalyan
ఎంటర్‌టైన్మెంట్

OG Movie: లక్షలు పెట్టి టికెట్లు కొంటున్నారు.. ఇది కదా పవన్ కళ్యాణ్ క్రేజ్!

OG Movie: కొన్ని రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (Pawan Kalyan OG) పేరు మారుమోగుతూనే ఉంది. మేకర్స్ వదిలే ప్రమోషన్స్‌తో పాటు, ఈ సినిమా ప్రీ సేల్స్ అని, టికెట్ ఆక్షన్ అని.. ఇలా ఏదో రకంగా ‘ఓజీ’ టైటిల్ ట్రెండ్ అవుతూనే ఉంది. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా రిజల్ట్‌తో పవన్ కళ్యాణ్ స్టామినా ఇదేనా అంటూ కొందరు హేళన చేసిన విషయం తెలిసిందే. అలాంటి వారందరికీ సమాధానమిస్తూ.. పవర్ స్టార్ స్థాయి ఇదని చాటి చెప్పే చిత్రంగా ‘ఓజీ’ విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, సెలబ్రిటీలు కూడా ఎంతగానో వేచి చూస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ చేసిన ట్వీట్‌తో ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కోసం వేచి చూస్తుందనే క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడీ సినిమా టికెట్ల ధర విషయంలోనూ రికార్డులను క్రియేట్ చేస్తూ.. సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Idli Kottu Trailer: వారసత్వాన్ని వదిలి వలసెళ్లిపోయాడు.. ఎక్కడికెళ్తాడు, ఎగిరెగిరి ఇక్కడికే రావాలి

ఆక్షన్‌లో లక్షలు పెడుతున్నారు

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్స్ హైక్ ఇచ్చినందుకు కొందరు.. ఫైర్ అవుతున్న విషయం తెలియంది కాదు. కానీ, పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానంతో ఈ సినిమా టికెట్లను కొందరు ఫ్యాన్స్‌.. వేలు, లక్షలు పెట్టి కొంటున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని భీమిలి మండలానికి చెందిన జనసేన అధ్యక్షుడు నక్కా శ్రీధర్.. పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానం, అంకితభావం ఎంత గొప్పదో నిరూపించారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘OG’ సినిమాపై ఉన్న అమితమైన అభిమానంతో ఆయన ఏకంగా రూ. 1.50 లక్షలు చెల్లించి టికెట్‌ను కొనుగోలు చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వహించిన ఓపెన్ ఆక్షన్‌లో ఈ టికెట్‌ను ఆయన దక్కించుకున్నారు. ఇది ఒక్క భీమిలిలోనే కాదు, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ‘OG’ సినిమా టికెట్ల కోసం భారీ ఎత్తున పోటీ పడుతున్నారు.

Also Read- Hema: ‘మా’ ప్రెసిడెంట్ సిస్టర్‌కే ఈ గతి పడితే.. మంచు లక్ష్మికి సపోర్ట్‌గా హేమ సంచలన వీడియో!

పవన్ కళ్యాణ్ అసలు క్రేజ్ ఇది

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర నగరాల్లోని అభిమానుల్లోనూ ఈ క్రేజ్ కనిపిస్తుంది. నైజాంలో మొదటి టికెట్ రూ. 5 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. అలాగే బెంగళూరులో రూ. 2.11 లక్షలకు, రూ. 1.5 లక్షలకు టికెట్లను కొనుగోలు చేశారు. విశాఖపట్నంలో మరో అభిమాని రూ. 50,000కు టికెట్ కొన్నారు. విశ్వనాథ్‌లో రూ. 1.12 లక్షలు, రూ. 23 వేలు, రూ. 18 వేలకు టికెట్లు విక్రయించారు. చెన్నైలో కూడా రూ. 1 లక్ష, రూ. 47 వేలు, రూ. 25 వేలకు టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ గణాంకాలు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తున్నాయి. మరో వైపు ఓవర్సీస్‌లో ప్రీ సేల్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ‘OG’ సినిమా విడుదల కాకముందే పలు రికార్డులు సృష్టిస్తుంది. ఇది కేవలం ఒక సినిమా అని మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ పట్ల అభిమానుల అంతులేని ప్రేమ, నిబద్ధతకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. సినిమా విడుదల కాకముందే ఈ స్థాయిలో అంచనాలు పెరగడం చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?

OG Benefit Show: మొత్తానికి సాధించారు.. ఏపీలో బెనిఫిట్ షో టైమింగ్ మారింది!

Haris Rauf controversy: పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ భార్య షాకింగ్ పోస్టు.. వివాదానికి మరింత ఆజ్యం