Bigg Boss Day 13 Promo 2
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: వారికి రంగు పడింది.. బిగ్ బాస్ మాములు ట్విస్ట్ కాదిది!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9), డే 13కు సంబంధించి వచ్చిన ప్రోమో 1‌లో రీతూ చౌదరికి ఇచ్చి పడేసిన కింగ్ నాగార్జున, డీమాన్ పవన్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించి షాక్ ఇచ్చారు. దానికి కంటిన్యూగా వెంటనే ప్రోమో 2 (Bigg Boss Telugu 9 Day 13 Promo 2)ని కూడా వదిలారు. ఈ ప్రోమోలో బోర్డుపై ఉన్న కొందరు కంటెస్టెంట్స్‌ ఫొటోలకు రంగు పూసి, ఈ వారం వారు చేసిన మిస్టేక్స్‌ని చెబుతున్నారు. ఇక ఈ ప్రోమో చివరిలో ఇచ్చిన ట్విస్ట్ అయితే.. కంటెస్టెంట్స్ కాదు కదా.. చూస్తున్న వారు కూడా ఊహించనిదని చెప్పుకోవాలి. అదేంటో, అసలు ఈ ప్రోమోలో ఏముందో చూద్దామా..

బిగ్‌ బాస్ దమ్మును ప్రశ్నిస్తావా..

ముందుగా డీమాన్ పవన్, రీతూ చౌదరి, ప్రియా, శ్రీజ, కళ్యాణ్, మనీష్‌లకు రంగు పడినట్లుగా నాగ్ పక్కన ఉన్న బోర్డు చూస్తుంటే తెలుస్తుంది. అనంతరం హరిత హరీష్‌ (Haritha Harish)ను ఉద్దేశిస్తూ.. ‘బిగ్‌ బాస్ దమ్ము గురించి ప్రశ్నించావు కదా? ఆన్ బిహాఫ్ ఆఫ్ బిగ్ బాస్ అడుగుతున్నాను, ఇంట్లో ఉంటావా? ఆట క్విట్ చేస్తావా?’ అని ప్రశ్నించారు. ‘నేను శ్రీజను దమ్ముంటే మీరు అని అన్నానే కానీ, బిగ్ బాస్‌ని ఎప్పుడూ అనలా సార్’ అని చెప్పినప్పుడు, హరీష్ బిగ్ బాస్‌నే అన్నారని శ్రీజ చెప్పింది.

Also Read-Bigg Boss Telugu 9: రీతూకి తలంటేసిన కింగ్.. డీమాన్ కెప్టెన్సీ తొలగింపు

ఎంత సేపూ తుత్తుతు, తుత్తుతునా?

‘నువ్వు ముందు రూల్ మాత్రమే విని, ఆ తర్వాత జడ్జ్‌మెంట్ వినవా?’ అని కళ్యాణ్‌ని ప్రశ్నిస్తే.. ‘వాళ్లే రూల్ పెట్టి వాళ్ళే అబ్జెక్ట్ చేస్తే.. అది నాకు వాలిడ్ అనిపించలేదు సార్’ అని కళ్యాణ్ చెప్పాడు. ఇక ప్రియ వంతు వచ్చింది. ‘ప్రియా నువ్వు ఎంతసేపూ అవతల వాళ్ళ తప్పులు వెతుకుతున్నావు? ఓనర్స్ గెలవాలని డిసైడ్ అయిపోయావా? అని నాగ్ ప్రశ్నించారు. ‘ప్రియా అండ్ శ్రీజ మీ ఇద్దరి గురించి ఒక మాట చెప్తాను… ఎంత సేపూ తుత్తుతు, తుత్తుతు… ఒక్కళ్లు మాట్లాడండమ్మ’ అని నాగార్జున (King Nagarjuna) కౌంటర్ ఇచ్చారు.

ఓనర్ ఇచ్చేస్తానంటే ఓకే నో ప్రాబ్లమ్

ప్రియాకు ఇంకో వీడియో చూపించాలి అని.. బొమ్మలు లాక్కునే గేమ్‌లో సుమన్ శెట్టి వీడియోను ప్రదర్శించారు. ‘అన్న కొడితే డైరెక్ట్ ఎలిమినేట్’ అని ప్రియ సుమన్ శెట్టిని హెచ్చరిస్తుంది. సుమన్ శెట్టి తన టీ షర్ట్‌ని కొడితే.. ‘అన్నా ఎలిమినేట్! ఎలిమినేట్’ అని ప్రియా ఈ వీడియోలో అరుస్తుంది. ‘ప్రియా.. సంజనాని గానీ, ఫ్లోరాని గానీ, సుమన్ కొట్టలేదు. టీ-షర్ట్‌ని కొడుతున్నారు’ అని నాగార్జున వివరణ ఇవ్వగానే ‘నా తప్పే, నేను కేర్‌ఫుల్‌గా లేను, ఐ యామ్ రియల్లీ సారీ’ అని సుమన్ శెట్టికి ప్రియా చెప్పింది. ‘ఓనర్ మిస్ అయిపోయింది కదమ్మా. ఓనర్ ఇచ్చేస్తానంటే ఓకే నో ప్రాబ్లం. ఐ టేక్ యువర్ సారీ’ అని ప్రియాకు సుమన్ శెట్టి కౌంటరిచ్చాడు.

Also Read- Hema: ‘మా’ ప్రెసిడెంట్ సిస్టర్‌కే ఈ గతి పడితే.. మంచు లక్ష్మికి సపోర్ట్‌గా హేమ సంచలన వీడియో!

ట్విస్ట్ ఇదే..

అనంతరం నాగ్ మాట్లాడుతూ.. ఈ సీజన్ ‘ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్’. ‘టైమ్ టు గివ్ ది టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్’ అని చెబుతూ.. ‘ఈ వారం నుంచి ఓనర్స్ విల్ బి టెనెంట్స్ అండ్ టెనెంట్స్ విల్ బి ఓనర్స్’ అని ప్రకటించి పెద్ద ట్విస్ట్‌ ఇచ్చారు. ఈ మాటతో ఓనర్స్ అయిన వాళ్లంతా.. క్లాప్స్ కొడుతున్నారు. అది ఈ ప్రోమోలో ఉన్న మ్యాటర్.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

IBPS: గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

Crime News: విశాఖపట్నం జిల్లాలో దారుణం.. ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య!

Raasi: స్నానం చేస్తూ చేసే.. అలాంటి సీన్స్ నాకు సెట్ అవ్వవు.. సంచలన కామెంట్స్ చేసిన రాశి

Mahabubabad District: బతుకమ్మ ఆడుతూ.. గుండెపోటుతో హిళ మృతి.. ఎక్కడంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమొదు