Konda Surekha: దేవుడి భూములు కబ్జాచేసేవారిపై పీడీ యాక్టులు పెట్టేందుకు వెనకాడొద్దని అధికారులను మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఆదేశించారు. దేవుడి భూములపై లీగల్ ఫైట్ గట్టిగా చేయాలని… అసలు న్యాయ పోరాటం సరైన రీతిలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి పేషీలో ఎండోమెంటు అధికారులు, ప్రభుత్వ ప్లీడర్లతో సమావేశం నిర్వహించారు. ఎండోమెంటు భూముల అన్యాక్రాంతానికి సంబంధించి కేసుల పురోగతిని సమీక్షించారు. ఎండోమెంటు కేసుల విషయంలో న్యాయవాదులతో ప్రతి ఆరు నెలలకొక సారి సమావేశం పెట్టి స్టేటస్ చెప్పాలని అధికారులను ఆదేశించారు. ఎండోమెంటు ప్లీడర్ల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎందుకు జాప్యం జరుగుతుంది?
దేవుడి భూములు కాపాడటంలో ఎందుకు జాప్యం జరుగుతుందని నిలదీశారు. తన ముందు వాదించినట్టు ఇక్కడ కోర్టులో వాదించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవుడి భూములు కాపాడటంలో లీగల్ టీం పాత్ర చాలా కీలకమైందన్నారు. తాను దేవాదాయ శాఖ మంత్రిగా రెండేళ్లు అయిందని.. ఇప్పటికీ కేసులు ఎన్ని గెలిచామో తెలియడం లేదని అన్నారు. కేసుల విషయంలో అప్డేట్ కోసం అడిగితే… డిపార్టుమెంటులో ఎవరు చెప్ప లేకపోవడం.. న్యాయ విభాగం అప్‌డేట్ చేయకపోవడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. దేవుడి భూములను మనం దక్కించుకోవాలన్నారు. ఏ కేసుల మీద న్యాయ పోరాటం చేశారో.. వాటిని పరిష్కరించడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో చెప్పాలన్నారు. 2002 నుంచి 2025 వరకు 1,500 కేసులు పెండింగులో ఉన్నాయన, ఈ కాల వ్యవధిలో 543 కోర్టు కేసులను డిస్పోజ్ చేసినట్టు ప్రభుత్వ ప్లీడర్లు మంత్రికి వివరించారు.
ఎక్స్‌పర్ట్ కమిటీ నియమించాలి
కేసుల్లో పురోగతికి సంబంధించిన అంశాలు, జడ్జిమెంట్ కాపీ ఎండోమెంటు శాఖ సెక్రటరీకి అందజేయాలని మంత్రి సూచించారు. ఎండోమెంటు ట్రిబ్యూనల్ అపాయింట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ట్రస్టీలకు సంబంధించిన కేసుల్లో గట్టిగా వాదించాలని, ఆర్కియాలజీ డిపార్టుమెంటు దగ్గర వివరాలు సేకరించాలన్నారు. అందుకు ఎక్స్‌పర్ట్ కమిటీ నియమించాలన్నారు. ఇట్రిమ్ ఆర్డర్స్‌లో పురోగతిపై ఆరా తీశారు. ఎండోమెంటు కేసుల్లోని కంటెప్ట్ ఆఫ్ కోర్టు అంశాలు తీవ్రంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. న్యాయ విభాగం, వారి కింద వ్యవస్థ సరైన టైంలో ఎండోమెంటు ఉన్నతాధికారులను అలర్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.
ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
వచ్చిన ఆర్డర్స్ ను అమలు పరిచేందుకు కూడా ఒక వ్యవస్థ ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కౌంటర్లు వేయడంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. ఈవోలు కూడా అందుకు సహకరించాలని, ఎవరైనా సహకరించకపోతే ఎండోమెంటు సెక్రటరీ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎండోమెంటు చట్టంపై అధికారులకు ట్రైనింగు క్లాసులు నిర్వహించాలన్నారు. జిల్లాకో లీగల్ ఆఫీసుర్ను, అదే విధంగా హైకోర్టుకు కూడా లైజన్ ఆఫీసర్ ను నియమించాలని, ఈవోల నుంచి ఒకరు ఉండాలని న్యాయ విభాగ టీం సూచించగా మంత్రి అనుమతించారు. ఈ సమావేశంలో ఎండోమెంటు ప్రిన్సి పల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్లు, న్యాయవాదులు, అసిస్టెంట్ కమిషనర్లు, ఈవోలు పాల్గొన్నారు.
Also Read: Chamala Kiran Kumar Reddy: మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన లేదు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి