PUBS
క్రైమ్

Dating Apps: డేటింగ్ స్కామ్ పబ్‌కి పోతే బుక్కయినట్టే!

– డేటింగ్ పేరుతో వల
– అందమైన అమ్మాయిలతో ఎర
– కథంతా నడిపిస్తున్న పబ్స్ యజమానులు
– వలపు మత్తులో మోసపోతున్న యువకులు

Fraud: మోసాలలో డేటింగ్ యాప్స్ మోసాలు వేరయా అన్నట్టుగా కొత్త రకం డేటింగ్ స్కామ్ హైదరాబాద్‌లో బయటపడింది. ఇన్నాళ్లూ డేటింగ్ యాప్స్‌లో ఆఫర్ చేసి తీరా కలిశాక బెదిరించడం, వసూళ్లు చేయడం వంటి నేరాలను చూశాం. పరిచయం పెంచుకుని డబ్బులు దండుకుని అకౌంట్ క్లోజ్ చేసుకున్న మోసాలనూ విన్నాం. కానీ, హైదరాబాద్‌లో డేటింగ్ యాప్స్ ఆధారంగా కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. అది నేరుగా డేటింగ్ యాప్ ఖాతాదారులు చేస్తున్న మోసం కాదు. పబ్ ఓనర్లు వెనుక ఉండి అమ్మాయిలతో కుమ్మక్కు అయి చేస్తున్న దందా ఇది.

అందమైన అమ్మాయిలతో వల

డేటింగ్ యాప్స్‌లో అమ్మాయి అందమైన చిత్రాలతో కవ్విస్తారు. స్వైప్ చేయగానే కలుద్దామని, ఆపై మితిమీరిన చనువుతో పబ్‌కు వెళ్దామని గోముగా ఆఫర్‌ చేస్తారు. పబ్‌లోకి వెళ్లాక లిక్కర్ బిల్లు చూసి బిత్తరపోవడం బాధితుల వంతు అవుతున్నది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నదని తెలుసుకునేలోపు జరగాల్సిన మోసం జరిగిపోతుంది. ఆ తర్వాత ఇతరులకు ఈ తరహాలో అమ్మాయిని కలిసి మోసపోయానని చెప్పుకోలేక బాధపడుతుంటారు.

హైటెక్ సిటీలో హైటెక్ ప్లాన్

టిండర్‌లో ఓ యువకుడికి రితికా అనే అమ్మాయి పరిచయమైంది. మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని ప్రపోజ్ చేసింది. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్ద కలవాలని లొకేషన్ కూడా ఫిక్స్ చేసింది. ఇద్దరూ మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నాక పక్కనే గలేరియా మాల్‌లో ఉన్న మోష్ క్లబ్‌కు వెళ్దామని కోరింది. ఏ పబ్‌కు వెళ్లాలనేది కూడా ఆమెనే డిసైడ్ చేసేసింది. యువకుడు గంతేసి అంగీకరించాడు. ఇద్దరూ పబ్‌కు వెళ్లారు. ఆ యువకుడితో తియ్యగా మాట్లాడి ఖరీదైన మద్యాన్ని ఆర్డర్ చేసింది. బిల్లు చూస్తే 40వేల 505 రూపాయలయింది. ఆ యువకుడు తర్వాత జరిగిందంతా ఓసారి నెమరేసుకున్నాడు. అమ్మాయిపై అనుమానం వచ్చి క్లబ్‌కు గూగుల్‌లో ఉన్న రివ్యూస్ పరిశీలించాడు. అచ్చంగా ఇలాగే మోసపోయిన ఓ యువకుడు రాసిన రివ్యూ చదివాడు. ఇదంతా, క్లబ్ వాళ్లు అమ్మాయిలతో కలిసి చేస్తున్న మోసం అని అర్థం చేసుకున్నాడు. అందరూ కలిసి తనను నమ్మించి మోసం చేశారని యువకుడికి స్పష్టమైపోయింది. ఇలా అమ్మాయి, పబ్ యజమానుల చేతిలో మోసపోయి రూ.20 వేల నుంచి రూ.40 వేలు నష్టపోయారు కొందరు. వారికి ఎదురైన అనుభవాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు.

Just In

01

CM Revanth Reddy: నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

Aaryan Movie: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ విడుదల వాయిదా.. కారణం రవితేజ, ప్రభాసే!

Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి కీలక ఆదేశాలు

Thummala Nageswara Rao: మొoథా తుఫాన్ నేపథ్యంలో.. పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి తుమ్మల

CM Revanth Reddy: సంక్షేమ నిధికి రూ.10 కోట్లు.. సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు