MLC Kavitha: కల్వకుంట్ల కవిత స్వగ్రామం సిద్దిపేట మండలంలోని చింతమడక గ్రామం. ఆమె తండ్రి కేసీఆర్(KCR) చింతమడకలోనే జన్మించారు. ఈ గ్రామం అభివృద్ధికి బీఆర్ఎస్(BRS) పాలనలో ప్రత్యేక నిధులు కేటాయించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం సైతం చేపట్టారు. దీంతో కల్వకుంట్ల కుటుంబంపై ప్రజల నుంచి ఆధరణ, సానుభూతి ఉంది. ఆ గ్రామం నుంచే కవిత జాగృతి(MLC Kavitha) సంస్థ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సొంతగ్రామం, అదీనూ ప్రజల నుంచి మంచి అభిమానం ఉంది. దీంతో రాజకీయ ప్రస్థానంను అక్కడి నుంచే ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే ఈ నెల 21న ఎంగిలిపూల బతుకమ్మకు చింతమడకకు వెళ్తున్నారు. ఆ గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు వెళ్తున్నారు. అయితే వారి అభిమానంను రాజకీయంగా మలుచుకోవాలనే ప్రయత్నాలు షూరు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. రాబోయే స్థానిక సంస్థల్లో జాగృతి నుంచి ఆమె అనుచరులను బరిలో నిలుపబోతున్నారని సమాచారం. అయితే సర్పంచా? లేకుంటే ఎంపీటీసీ(MPTC)గా బరిలో నిలుపుతుందా? అనేది మాత్రం స్పష్టత రాలేదు.
గ్రామంపై ప్రత్యేక ఫోకస్
కేసీఆర్ కుటుంబంపై ప్రజలకు సానుభూతి ఉండటంతోనే రాజకీయ ఎత్తుగడలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ విజయం సాధిస్తే ప్రజల్లో సైతం నమ్మకం పెరుగుతుందని, కవితకు రాజకీయ భవిష్యత్ ఉంటుందనే విశ్వాసం వస్తుందని అందుకే చింతమడక నుంచే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. అందేకే గ్రామంపై ప్రత్యేక ఫోకస్ పెట్టనట్లు సమాచారం. కవిత మాత్రం ఇప్పటివరకు పోటీపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడు పోటీపై ప్రకటిస్తుందనేది రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది.
Also Read: Singareni Employees: గుడ్ న్యూస్.. సింగరేణి ఉద్యోగులకు ప్రమోషన్లు!
పార్టీ ఆవిర్భానికి ముందు సమయం
కవిత మాత్రం ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను ఆసక్తి గమనిస్తున్నారు. అన్ని వర్గాల నేతలతో, పార్టీలు అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారో అదే ప్రణాళికలు అవలంబించేందుకు సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సందర్భాను సారంగా బీఆర్ఎస్ లోని కొంతమంది నేతలపై, మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నారు. నిత్యం ఆరోపణలు చేసినా డ్యామేజ్ అవుతుందని భావించి ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతున్నట్లు ఆమె శైలీ స్పష్టమవుతోంది. కేసీఆర్(KCR) సైతం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భానికి ముందు సమయం, సందర్భం, అదును కోసం వేచిసూచినట్లు కవిత సైతం మేధావులతో పాటు రాజకీయ విశ్లేషకులతో రాజకీయ పరిస్థితులను అధ్యాయనం చేస్తున్నట్లు ఆమె అనుచరులు తెలిపారు.
జాగృతి అంటే బతుకమ్మ..
తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడంకోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం నుండి ప్రేరణ పొంది 2006 ఆగస్టులో తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశారు. బతుకమ్మను పెద్ద ఎత్తున జరుపుకుంటూ, అన్ని వర్గాల ప్రజలను అందులో పాల్గొనేలా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుత పోరాటంలో మహిళలు, యువత, సమాజంలోని పెద్ద వర్గాల మద్దతును సమీకరించడంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది. బతుకమ్మ అంటే జాగృతి.. జాగృతి అంటే బతుకమ్మ అనే నానుడిని తీసుకొచ్చింది. అయితే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత జాగృతి సంస్థ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు చేపడుతుంది. అయితే ఈసారి బతుకమ్మను సైతం నిర్వహించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే చింతమడకకు వెళ్తుంది. సొంత ఊరిలో ఎంగిలి పూల బతుకమ్మ ఆడనున్నది. 22న తెలంగాణ జాగృతి కార్యాలయంలో, 23న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో, 26 నుంచి 28వ తేదీ వరకు విదేశాల్లో ఖాతర్, మల్టా, లండన్ లో బతుకమ్మ వేడుకలకు కవిత హాజరు అవుతున్నట్లు జాగృతి నేతలు తెలిపారు. అదే విధంగా ఈ నెల 21 నుంచి 29 వరకు అన్ని జిల్లాల్లోనూ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Also Read: Techie Shot Dead: అమెరికాలో ఘోరం.. తెలంగాణ యువకుడ్ని.. కాల్చి చంపిన పోలీసులు