Konda Surekha: తెలంగాణను ఎకో టూరిజం హబ్ (Eco-Tourism Hub) గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎకో టూరిజం కోసం గుర్తించిన సైట్లలో సమగ్రంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఎకోటూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ టూరిజం పాలసీలో అంశాలపై ఆరా తీశారు. అనంతగిరి(వికారాబాద్), కనకగిరి(ఖమ్మం), నందిపేట్(నిజామాబాద్), మన్ననూర్ జంగల్ రిసార్టు(నాగర్ కర్నూల్), ముచ్చెర్ల ఎకో పార్కు(నల్గొండ), వైజాగ్ కాలనీ(నల్గొండ), మంజీరా(సంగారెడ్డి), అమరగిరి(నాగర్ కర్నూల్) తదితర ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టు అమలుపై సుదర్ఘీ చర్చించారు.
ఎకో టూరిజం ప్రాజెక్టులను అమలు చేయాలి
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎకో టూరిజం సెంటర్లలో స్థానిక గిరిజనులు, ఇతర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం ఎకో టూరిజం ప్రాజెక్టులను అమలు చేయాలని సూచించారు.ఆ ప్రాంతాల్లో టెంపుల్స్ ఉంటే అక్కడ ఆథ్యాత్మిక పద్ధతిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌బెక్కా కొండల తరహాలో నీలాద్రి కొండలపై ప్రాచీన కాలం నాటి గుర్తులు ఉన్నందున పర్యాటక ప్రాంతంగా ఎకో టూరిజం ప్రాంతంగా డెవలప్ చేయాలన్నారు. అవసరమైన నిధులు టూరిజం డిపార్టుమెంటు, ఎండోమెంటు శాఖ నుంచి తీసుకొని అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఎకో-టూరిజం ప్రాజెక్టులు కేవలం ప్రకృతి వైభవం వరకే పరిమితం కాకుండా, అక్కడి ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాలన్నారు.
ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది
ఎక్కడ ఆలయాలు ఉన్నాయో అక్కడి ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, ధార్మిక విశ్వాసాలు ప్రతిబింబించేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటకులు కేవలం స్థానిక ప్రకృతి సౌందర్యం మాత్రమే కాకుండా, ఒక విశ్వాసం, ఆధ్యాత్మిక అనుభూతితో కూడిన తృప్తితో సందర్శిస్తారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ పొదెం వీరయ్య, అటవీ శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్(హెచ్ఓఎఫ్ఎఫ్) డాక్టర్ సువర్ణ, తెలంగాణ ఎఫ్డీసీ ఎండీ సునీత భగవత్, పీసీసీఎఫ్(వైల్డ్ లైఫ్) ఏలూ సింగ్ మేరు, సీసీఎఫ్ రామలింగం(సోషల్ ఫారెస్టు)అధికారులు పాల్గొన్నారు.
Also Read: Dussehra Holidays 2025: విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు.. లోకేశ్ కీలక ప్రకటన