Singareni Employees: ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న అర్హత గల ఈపీ ఆపరేటర్లకు ఎక్స్ కవేషన్ కేటగిరీ-డీ నుండి ఎక్స్ కవేషన్ కేటగిరీ-సీకి, ఎక్స్ కవేషన్ కేటగిరీ-సీ నుంచి ఎక్స్ కవేషన్ కేటగిరీ-బీ కి త్వరలో పదోన్నతులు లభించనున్నాయి. ఈ నిర్ణయం వల్ల సింగరేణి వ్యాప్తంగా సుమారు 150 మంది ఆపరేటర్లు ఈ ప్రమోషన్లు పొందనున్నారు. ఎక్స్ కవేషన్ కేటగిరీ-డీ లో రెండేండ్లు పూర్తిచేసిన ఆపరేటర్లకు ఎక్స్ కవేషన్ కేటగిరీ-సీ ప్రమోషన్ ఇవ్వడానికి సంస్థ అంగీకరించింది. అలాగే ఎక్స్ కవేషన్ కేటగిరీ-సీ లో మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసిన ఆపరేటర్లకు ఎక్స్ కవేషన్ కేటగిరీ-బీ కి పదోన్నతులను ఇవ్వటానికి యాజమాన్యం అంగీకరించింది. ఖాళీలతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఈ ఒక్కసారి మాత్రమే కల్పించాలని నిర్ణయించారు.
గతంలో ఈపీ ఆపరేటర్లు..
ఈమేరకు సంస్థ సీఎండీ ఎన్ బలరామ్(CMD N Balaram) ఆదేశాల మేరకు గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఇటీవల జరిగిన 38వ సీఎండీ స్థాయి, 50వ డైరెక్టర్ స్థాయి నిర్మాణాత్మక సమావేశంలో గుర్తింపు కార్మిక సంఘం ఇచ్చిన ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఈపీ ఆపరేటర్లు ఎక్స్ కవేషన్ కేటగిరీ-డీ లో 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్రాక్టికల్ పరీక్ష, అసెస్‌మెంట్ నివేదికలో అర్హత సాధించినట్లయితే వారికి ఎక్స్ కవేషన్ కేటగిరీ-డీ నుంచి ఎక్స్ కవేషన్ కేటగిరీ-సీ కి ఖాళీలను బట్టి ప్రమోషన్లను కల్పించేవారు. అలాగే ఎక్స్ కవేషన్ కేటగిరీ-సీ లో 3 సంవత్సరాలు పనిచేసి ప్రాక్టికల్ పరీక్ష, అసెస్‌మెంట్ నివేదికలో అర్హత సాధించినట్లయితే వారికి ఎక్స్ కవేషన్ కేటగిరీ-సీ నుంచి ఎక్స్ కవేషన్ కేటగిరీ-బీ కి ఖాళీలు ఏర్పడినప్పుడు పదోన్నతులను కల్పించేవారు.
Also Read: TGPSC Controversy: గ్రూప్ 1 పోస్టులకు రూ.3 కోట్లు.. నిరూపించాలంటూ తల్లితండ్రులు డిమాండ్!
2 సంవత్సరాల సర్వీస్..
ఈ అంశంపై యాజమాన్యం స్పందించి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ వారు ఈ అంశంపై చర్చించి ఒక నివేదికను సమర్పించారు. ఈ నివేదిక పరిశీలించిన అనంతరం సంస్థ సీఎండీ ఎన్ బలరాం నాయక్ ఈ ఒక్కసారికి ఖాళీలతో సంబంధంలేకుండా కంపెనీ నియమ నిబంధనలను అనుసరించి ప్రమోషన్లు ఇవ్వటానికి అంగీకరించారు. దీని ప్రకారం మార్చి 2025 లేదా సెప్టెంబర్ 2025 నాటికి ఈపీ ఆపరేటర్ ఎక్స్ కవేషన్ కేటగిరీ-డీలో 2 సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసిన ఈపీ ఆపరేటర్లందరికీ ఈపీ ఆపరేటర్ ఎక్స్ కవేషన్ కేటగిరీ-సీ ప్రమోషన్ ఇవ్వనున్నారు. ఈపీ ఆపరేటర్ ఎక్స్ కవేషన్ కేటగిరీ-సీలో 3 సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసిన ఈపీ ఆపరేటర్లందరికీ ఈపీ ఆపరేటర్ ఎక్స్ కవేషన్ కేటగిరీ-బీ గా పదోన్నతి కల్పించనున్నారు. అయితే వీరు ప్రాక్టికల్ పరీక్ష, అసెస్‌మెంట్ నివేదికలో అర్హత సాధించవలసి ఉంటుంది.
Also Read: Kavitha: ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ .. కవిత సంచలన కామెంట్స్