Bathukamma: బతుకమ్మ పండుగ తెలంగాణ సంసృతి అని, ఆ పండుగ సహజత్వాన్ని కాపాడటం అందరి బాధ్యత అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు(Min Jupally Krishna Rao) పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. ఈనెల 21న వెయ్యి స్తంబాల వద్ద భారీ సెలబ్రేషన్స్ చేస్తున్నామని, ఇది ప్రోగ్రామ్ గిన్నిస్ బుక్ ఎక్కాలని కోరారు. ఇప్పటికే కవులను రచయితలను పిలిచి చర్చించి బతుకమ్మ పాటలు రాయించామన్నారు. బతుకమ్మ జరిగే ప్రాంతంలో డెకరేషన్ ఏర్పాటుతో పాటు విమానాశ్రయంలో కూడా మన సంసృతి తెలిసేలా తోరణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రకరకాల పాటలతో బతుకమ్మ..
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) మాట్లాడుతూ.. తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ పండుగ అని వివరించారు. కాంగ్రెస్ శ్రేణులు ఎంగిలి పువ్వు నుండి సద్దుల బతుకమ్మ వరకు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ పేరిట రాజకీయం చేసిందన్నారు. రకరకాల పాటలతో బతుకమ్మ ను రాజకీయం చేస్తున్నారన్నారు. బతుకమ్మ పండుగలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా జరుపుకోవాలన్నారు. హైదరాబాద్(Hyderabad) లోని బతుకమ్మ కుంట బతుకమ్మ కోసం మళ్ళీ వచ్చిందన్నారు. బతుకమ్మ కుంటను కాపాడటంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy), హనుమంతు రావు(Hanumantha Rao) పాత్ర కీలకం అని వ్యాఖ్యానించారు.
Also Read: Indian Railways: రైల్వేలో కొత్త రూల్.. అక్టోబర్ 1 నుంచే అమలు.. ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!
గత ప్రభుత్వం హయంలో..
మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా బతుకమ్మ కుంటలో ఆడకుండా చేశారని, గత ప్రభుత్వం హయంలో ఎంతోమందిని అడిగినా పట్టించుకోలేదన్నారు. కవిత ఎక్కడో విదేశాల్లో ఆడింది కానీ బతుకమ్మ కుంట రాలేదన్నారు. బీఆర్ ఎస్ పార్టీ నాయకుడు కబ్జా చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాన్ని పునర్ నిర్మాణం చేశామన్నారు. బతుకమ్మ కుంటకు విముక్తి కలిగించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా(Hydraa)కు అభినందనలు తెలిపారు.
Also Read: Telangana: తెలంగాణ విమోచన వేడుకలకు సర్వంసిద్ధం.. ముఖ్యఅతిథిగా రాజ్‌నాథ్ సింగ్