Indian Teams Master Plan Bumrah Wonderful Role IN Newyork
స్పోర్ట్స్

T20 Match: బుమ్రానా, మజాకా..

Indian Teams Master Plan Bumrah Wonderful Role IN Newyork: టీ20 వరల్డ్‌కప్‌ 2024లో న్యూయర్క్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో అర్షదీప్ సింగ్ భారత బౌలింగ్‌ ఎటాక్‌ చేయగా, మహమ్మద్ సిరాజ్ అతడితో పాటు బంతిని పంచుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌ ఎటాక్‌కు వచ్చాడు. తన పేస్‌ బౌలింగ్‌తో ఐరీష్‌ బ్యాటర్లను బుమ్రా బెంబేలెత్తించాడు.

బుమ్రా తన బౌలింగ్‌ ఎటాక్‌ను మెయిడిన్‌ ఓవర్‌తో ప్రారంభించాడు. ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ వేసిన బుమ్రా, ఐర్లాండ్‌ బ్యాటర్‌ హ్యారీ టెక్టార్‌కు చుక్కలు చూపించాడు. బుమ్రా బౌలింగ్‌ దాటికి ఆ ఓవర్‌లో టెక్టార్‌ కనీసం ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు.ఈ క్రమంలో బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక మెయిడిన్‌లు (టెస్టు సభ్యత్వ దేశాలు) చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. బుమ్రా ఇప్పటివరకు టీ20ల్లో 11 మెయిడిన్ ఓవర్లు వేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత వెటరన్‌ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ పేరిట ఉండేది.

Also Read: ఆస్ట్రేలియా స్పిన్‌ బౌలర్‌ అరుదైన రికార్డు

తాజా మ్యాచ్‌తో భువీని బుమ్రా అధిగమించాడు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన బుమ్రా, 3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో ఇద్దరు బౌలర్లు బుమ్రా కంటే ముందున్నారు. ఈ జాబితాలో ఉగాండా బౌలర్ ఎఫ్ నుసుబుగా 15 మెయిడిన్ ఓవర్లతో తొలి స్ధానంలో ఉండగా, కెన్యా బౌలర్ షెబ్ ఎన్గోచె 14 రెండో స్థానంలో ఉన్నాడు.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ