Australian Bowler Adam Zampa Sensational Record: ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా అరుదైన రికార్డు సంపాదించాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఒమన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన జంపా, టీ20ల్లో 300 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. అంతేకాదు ఈ ఘనత సాధించిన రెండో ఆస్ట్రేలియన్ బౌలర్‌గా ఓవరాల్‌గా 28 ఆటగాడిగా జంపా రికార్డుల్లోకెక్కాడు.
జంపాకు ముందు ఆండ్రూ టై టీ20ల్లో 300 వికెట్ల మార్కును అధిగమించాడు. టై 2014-24 మధ్యలో 332 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక టీ20 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో టై 15వ స్థానంలో నిలిచాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 258 మ్యాచ్‌లు ఆడిన జంపా, 3 ఐదు వికెట్ల ప్రదర్శనలతో 301 వికెట్లను పడగొట్టాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ బౌలర్ డ్వేన్ బ్రావో అగ్రస్థానంలో ఉండగా, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, ఇమ్రాన్ తాహిర్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో భారత బౌలర్ చహల్ 11వ స్థానంలో.. పియూశ్ చావ్లా 22, అశ్విన్ 25వ స్థానంలో కొనసాగుతున్నారు. కాగా, బార్బడోస్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 39 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది.
Also Read: విరాట్ కొహ్లీ సరికొత్త రికార్డు
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్, స్టోయినిస్, వార్నర్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్ బంతితోనూ రాణించాడు. స్టోయినిస్‌తో పాటు జంపా, ఇల్లిస్ స్టార్క్ కూడా సత్తా చాటడంతో ఒమన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 రన్స్ చేసిన అయాన్ ఖాన్ ఒమన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.