Aishwarya Rai ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ లవ్ చెయ్యలేదని తల పగలగొట్టుకున్న స్టార్ హీరో.. ?

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్, విశ్వసుందరి హోదాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అందాల తార, ఒకప్పుడు ఆమె అందానికి అందరూ ఫిదా అయ్యేవారు. ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటే, ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుందని అప్పట్లో చాలా మంది అనుకునేవారు. అంతటి అసాధారణ అందంతో, పెళ్లయి, కూతురు పుట్టిన తర్వాత కూడా ఐశ్వర్య తన ఆకర్షణను అలాగే కాపాడుకుంది. కొంత బరువు పెరిగినా, ఆమె ముఖంలోని ఆ సౌందర్యం ఇప్పటికీ అలాగే ఉంది. ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకొని అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టింది. 

Also Read: Heroine: ఒక్క సినిమాలో చేసేందుకు.. ఈ నటికి రూ. 530 కోట్ల పారితోషికం.. ఎక్కడో కాదు ఇండియాలోనే!

అయితే, అభిషేక్‌తో పెళ్లికి ముందు ఆమె సల్మాన్ ఖాన్‌తో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభంలోనే ఐశ్వర్య, సల్మాన్‌తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ చాలా సంవత్సరాల పాటు సంబంధంలో ఉన్నారు, కానీ చివరికి ఒకరికి ఒకరు బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఈ బ్రేకప్ వెనుక సల్మాన్ ఖాన్ ఆమెను ఎంతగానో ఇబ్బంది పెట్టాడని గతంలో వార్తలు వచ్చాయి. ఆ ఇబ్బందులను భరించలేకనే ఐశ్వర్య అతనితో సంబంధాన్ని ముగించిందని చెప్పబడింది.

Also Read: Sekhar Kammula: ఇలాంటి సినిమాలు నిర్మించ‌డానికి ధైర్యం ఉండాలి.. యంగ్ హీరో సినిమాపై ప్రశంసలు

తాజాగా, బాలీవుడ్ దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడుతూ, సల్మాన్ ఖాన్ ఐశ్వర్యపై  ప్రేమతో, కొంత విచిత్రంగా ప్రవర్తించేవాడని వెల్లడించారు. సల్మాన్ తన ప్రేమలో ఎంతగా మునిగిపోయాడంటే, అది అతన్ని అనుకోని రీతిలో ప్రవర్తించేలా చేసిందని, ఆ పరిస్థితిని తట్టుకోలేక ఐశ్వర్య విడిపోయే నిర్ణయం తీసుకుందని చెప్పారు.

Also Read: Fee Reimbursement: రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం రైట్ డెసిషన్.. పేరెంట్స్ హర్షం.. ఏందుకొ తెలుసా..?

అంతేకాదు, విడాకుల తర్వాత సల్మాన్, ఐశ్వర్య నివసించే అపార్ట్‌మెంట్ దగ్గరికి వచ్చి, తన తలను గోడకు కొట్టుకున్నాడని కూడా ప్రహ్లాద్ పేర్కొన్నారు. ప్రహ్లాద్ కక్కర్, ఆ సమయంలో ఆ అపార్ట్‌మెంట్‌లోనే నివసిస్తున్నానని, అందుకే, ఈ సంఘటన తనకు తెలిసిందని వివరించి చెప్పారు. ఒకసారి ఐశ్వర్య దగ్గరికి వెళ్లి , “ అంతలా ఇబ్బంది పడుతూ అతనితో ఎందుకు సంబంధం కొనసాగిస్తున్నావు?” అని అడిగాడని, ఆ సమయంలో సల్మాన్ ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని ఐశ్వర్య కూడా చెప్పిందని ప్రహ్లాద్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారాయి.

Just In

01

Delhi Blast: ఒక్కొక్కటిగా వెలుగులోకి నిజాలు.. ఇంటెలిజెన్స్ తాజా అనుమానం ఇదే

Jubilee Hills Bypoll: పోలింగ్ రోజూ పంపకాల జోరు?.. జూబ్లీహిల్స్‌లో ఎంత పంచారంటే?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బై పోలింగ్ లో హీట్ ట్రెండ్.. మాస్ లోని మెజార్టీ లంతా నవీన్ వైపే?

Delhi Blast: పేలుడుకు ముందు 3 రోజులపాటు అండర్‌గ్రౌండ్‌లోకి ఉమర్.. వెలుగులోకి సంచలన నిజాలు

Gadwal District: నిధులు లేక నిరీక్షణ రెండేళ్ల నుంచి రాని గ్రాంట్లు.. చెక్కులు పాస్ కాక పంచాయతీ కార్యదర్శుల అవస్థలు