Manchu Manoj
ఎంటర్‌టైన్మెంట్

Manchu Manoj: నా బిడ్డ మహవీర్ లామా.. అని అమ్మ అంటుంటే.. !

Manchu Manoj: చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్.. ‘మిరాయ్’ (Mirai Movie) చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు ముందు చేసిన ‘భైరవం’ (Bhairavam)‌లో ఎలా అయితే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేశారో.. ఇప్పుడొచ్చిన ‘మిరాయ్’లోనూ విలన్‌గా నటించి తన సత్తా చాటాడు. ఈ చిత్రంలో ఆయన చేసిన బ్లాక్ స్వార్డ్ పాత్రకు ప్రేక్షకుల, విమర్శకుల, సెలబ్రిటీల ప్రశంసలను అందుకుంటున్నారు. ‘మిరాయ్’ పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తూ.. 5 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌కు చేరింది. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని తాజాగా విజయవాడలో సక్సెస్ సెలబ్రేషన్స్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ స్పీచ్‌కు జనాలు నీరాజనాలు పలికారు.

Also Read- Heroine: ఒక్క సినిమాలో చేసేందుకు.. ఈ నటికి రూ. 530 కోట్ల పారితోషికం.. ఎక్కడో కాదు ఇండియాలోనే!

అమ్మ మాటలు నా మనసును కదిలించాయి

ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. ‘మిరాయ్’ విడుదల తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ మా అమ్మ దగ్గర నుంచే. నిజంగా అమ్మ నుంచి అలాంటి ప్రశంసలు అందుకుని చాలా కాలం అవుతుంది. అమ్మ మాటలు నా మనసును కదిలించాయి. సినిమా చూసి మా అమ్మ (Manchu Manoj Mother) నన్ను హత్తుకుని భావోద్వేగానికి లోనైంది. ‘నీకు తెలియదురా నాన్నా, నిన్ను ఎంతగా వెండితెర మీద చూడటం మిస్ అయ్యానో.. ఇకపై ఇలా సినిమాలు చేస్తూ ఉండు’ అని అంది. అంతేకాదు, అందరికీ ఫోన్స్ చేసి ‘మిరాయ్’ చూశారా, నా బిడ్డ మహవీర్ లామా పాత్రలో అదిరిపోయేలా నటించాడు అని చెప్పుకుని సంతోషించింది. నా కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఈ సినిమాను చూడటం.. నా జీవితంలో మర్చిపోలేని అనుభూతినిచ్చింది. నా పిల్లలకు కూడా ‘మిరాయ్’ చాలా బాగా నచ్చింది. అమ్మ మాత్రమే కాదు.. నేను కంటిన్యూగా సినిమాలు చేయాలని నా అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. వారు ఎదురు చూసిన సినిమా ‘మిరాయ్’ రూపంలో నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నిర్మాత విశ్వప్రసాద్ కాంప్రమైజ్ కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తీసుకెళ్లారు. అలాంటి నిర్మాత మరొకరు ఉండరు. డార్లింగ్ ప్రభాస్‌ (Prabhas)తో ఆయన చేస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab) కూడా మామూలుగా ఉండదు. రికార్డ్‌లు తిరగరాసే సినిమా అది. తర్వాత వారి సంస్థలో వస్తున్న ‘మోగ్లీ’ కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Also Read- OG Ticket Price: బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 1000.. సింగిల్ స్క్రీన్, మల్టీ‌ప్లెక్స్‌లలో టికెట్ ధరలు ఎంతంటే?

చిరంజీవి కొడుకో, మోహన్ బాబు కొడుకో కానవసరం లేదు

మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వచ్చి ఆదరిస్తారు. తెలుగు మీడియా మిత్రులు కూడా నాపై, మా సినిమాపై ఎంతో ప్రేమను చూపిస్తున్నందుకు వారందరికీ నా కృతజ్ఞతలు. ‘లిటిల్ హార్ట్స్’ అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. ఇక్కడొక విషయం చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో స్టార్‌గా ఎదగాలంటే చిరంజీవి (Chiranjeevi) కొడుకో, మోహన్ బాబు (Mohan Babu) కొడుకో కావాల్సిన అవసరం లేదు. ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, యూట్యూబర్ అయినటువంటి మౌళి కూడా హీరోగా ఎదగవచ్చు అని మన ప్రేక్షకులు నిరూపించారు. ‘మిరాయ్’ కోసం ఎలా నిలబడ్డానో.. రేపు మౌళి తన సినిమాలో నటించమని అడిగినా నటిస్తాను. నాకు అలాంటి భేదాలు ఎప్పటికీ ఉండవు. నెక్ట్స్ ‘డేవిడ్ రెడ్డి’ అనే మూవీ చేస్తున్నాను. బ్రిటీష్ కాలంలో జరిగిన యాక్షన్ స్టోరీతో ఈ సినిమా వస్తుంది. ‘కెజియఫ్’ టీమ్ మెంబర్స్ రవి బస్రుర్, ఉజ్వల్ మా మూవీకి వర్క్ చేస్తున్నారు. టీ సిరీస్ వాళ్లతో ‘అబ్రహాం లింకన్’ అనే యాక్షన్ మూవీ ఒకటి చేస్తున్నాను. ఇవి కాకుండా ‘రక్షక్’ అనే మూవీలో ఫస్ట్ టైమ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాను. ప్రేక్షకుల ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

IBPS: గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

Crime News: విశాఖపట్నం జిల్లాలో దారుణం.. ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య!

Raasi: స్నానం చేస్తూ చేసే.. అలాంటి సీన్స్ నాకు సెట్ అవ్వవు.. సంచలన కామెంట్స్ చేసిన రాశి

Mahabubabad District: బతుకమ్మ ఆడుతూ.. గుండెపోటుతో హిళ మృతి.. ఎక్కడంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమొదు